తెలుగు న్యూస్  /  Entertainment  /  Napi Requested To Amitabh Bachchan To Not Act In Biscuit Advertisement

Amitabh Bachchan Advertisement : బిగ్ బి.. దయచేసి ఆ బిస్కెట్ ప్రకటనలో నటించడం మనేయండి

Anand Sai HT Telugu

16 January 2023, 21:09 IST

    • Amitabh Bachchan Biscuit Advertisement : కొన్నేళ్ల క్రితం క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో నటించిన అమితాబ్ బచ్చన్.. ఆ తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించేందుకు నిరాకరించారు. 
అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ (HT_PRINT)

అమితాబ్ బచ్చన్

సినిమా సెలబ్రిటీలు సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో నటించడం సర్వసాధారణమైపోయింది. వంటనూనెలు, చాక్లెట్లు, బట్టల ప్రకటనలతో పాటు బిస్కెట్ల ప్రకటనల్లో చాలా మంది సెలబ్రిటీలను మనం చూస్తుంటాం. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) బిస్కెట్ ప్రకటనలో నటించడంపై కలకలం రేపింది.

ట్రెండింగ్ వార్తలు

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?

ఇప్పుడు NAPI (Nutrition Advocacy in Public Interest) ఈ విషయమై ప్రముఖ నటుడు అమితాబ్‌కి లేఖ రాసింది. డాక్టర్ అరుణ్ మీడియాతో మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ నటించిన బిస్కెట్ ప్రకటన నిజంగా మోసపూరితమైనది. ఆ బిస్కెట్లలో చక్కెర, కొవ్వు, సోడియం అధికంగా ఉంటాయి. ఈ బిస్కెట్ కంపెనీలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేవు. గత సంవత్సరం డిసెంబర్‌లో పిల్లల కోసం ఒక టెలివిజన్(Television) కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ అదే బిస్కెట్‌ను ఆమోదించడానికి ఎంచుకున్నారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.' అని చెప్పాడు.

'దయచేసి అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన, కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఏవైనా ఆహార ఉత్పత్తుల ప్రకటనలను ఆపండి. సాధారణంగా, ఏదైనా ఆహార పదార్థంలో చక్కెర లేదా కొవ్వు మొత్తం 10 శాతం కంటే ఎక్కువ ఉంటే, అది HFSS (అధిక కొవ్వు, ఉప్పు మరియు చక్కెర) విభాగంలో చేరుస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి యాడ్స్‌లో నటించకండి. ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారోత్పత్తుల ప్రకటనల్లో నటించడం సరైనదేనా అని ఆలోచించండి.' అని అరుణ్ లేఖలో కోరారు.

అమితాబ్ బచ్చన్ గతంలో కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించేందుకు నిరాకరించారు. కొన్నేళ్ల క్రితం క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ యాడ్‌లో అమితాబ్ నటించారు. అప్పటి నుంచి ఆ యాడ్‌లో కనిపించలేదు. అలాగే, 7 సంవత్సరాల క్రితం శీతల పానీయం, 2018లో హార్లిక్స్ ప్రకటన నుండి వైదొలిగాడు. ఇప్పుడు NAPI అభ్యర్థన మేరకు ఈ బిస్కెట్ ప్రకటనలో నటించడం మానేస్తారో లేదో వేచి చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.