తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Gives Clarity On Work With Debutant Directors

Nani on Star Directors: స్టార్‌ డైరెక్ట‌ర్ల‌తో నాని ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు - క్లారిటీ ఇదిగో

16 March 2023, 6:38 IST

  • Nani on Star Directors: టాప్ డైరెక్ట‌ర్స్‌తో కాకుండా కొత్త ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేస్తోండ‌టంపై హీరో నాని క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న ఏమ‌న్నారంటే...

హీరో నాని
హీరో నాని

హీరో నాని

Nani on Star Directors: ప‌దిహేనేళ్ల కెరీర్‌లో స్టార్ డైరెక్ట‌ర్ల కంటే కొత్త ద‌ర్శ‌కుల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేశాడు నాని. స్టార్‌డ‌మ్ వ‌చ్చిన త‌ర్వాత కూడా రిజ‌ల్ట్ గురించి ఆలోచించ‌కుండా న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్నాడు. నాని హీరోగా న‌టించిన ద‌స‌రా సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శకుడిగా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్నాడు. ఇటీవ‌ల ప్రారంభ‌మైన నాని31వ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడే మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడు. కొత్త ద‌ర్శ‌కుల‌తో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా నాని క్లారిటీ ఇచ్చాడు.

బుధ‌వారం అభిమానుల‌తో ట్విట్ట‌ర్ ద్వారా ముచ్చ‌టించాడు నాని. ఈ సంద‌ర్భంగా ఇంకా ఎంత కాలం డెబ్యూడెంట్స్‌కు ఛాన్స్ ఇస్తావ్ కొంచెం టాప్ డైరెక్ట‌ర్స్‌తో వ‌ర్క్ చేయ్ అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు టాలెంట్ కొత్త‌ది అయితే ఏంటి పాత‌ది అయితే ఏంటి అంటూ భిన్నంగా స‌మాధానం ఇచ్చాడు నాని.

కొత్త పాత అనే తేడా నాకు తెలియ‌డం లేద‌ని స‌మాధానం చెప్పాడు. ద‌స‌రా సినిమాను పుష్ప‌, కేజీఎఫ్‌, రంగ‌స్థ‌లం సినిమాల‌తో కంపేర్ చేస్తూ మ‌రో అభిమాని నానిని ప్ర‌శ్న అడిగాడు. అత‌డికి సైటైరిక‌ల్‌గా నాని స‌మాధానం ఇవ్వ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

టెర్మినేట‌ర్‌లో ఆర్నార్ట్‌, దిల్ వాలే దుల్హ‌నియా లేజాయింగే షారుఖ్‌ఖాన్ లెద‌ర్ జాకెట్స్ ధ‌రిస్తారు. అలాగ‌ని ఆ రెండు సినిమాలు ఒకేలా ఉండ‌వు అంటూ ఫ‌న్నీగా స‌మాధానం ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. ద‌స‌రా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.