తెలుగు న్యూస్  /  Entertainment  /  Nandamuri Ramakrishna Meets With A Car Accident In Hyderabad

Nandamuri Ramakrishna Accident: రోడ్డు ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డ బాల‌కృష్ణ సోద‌రుడు

11 February 2023, 18:02 IST

  • Nandamuri Ramakrishna Accident: నంద‌మూరి బాల‌కృష్ణ సోద‌రుడు రామ‌కృష్ణ రోడ్డు ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌యాణిస్తోన్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొన్న‌ట్లు తెలిసింది.

నంద‌మూరి రామ‌కృష్ణ
నంద‌మూరి రామ‌కృష్ణ

నంద‌మూరి రామ‌కృష్ణ

Nandamuri Ramakrishna Accident: నంద‌మూరి బాల‌కృష్ణ సోద‌రుడు రామ‌కృష్ణ పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. శుక్ర‌వారం రామ‌కృష్ణ ప్ర‌యాణిస్తోన్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొన్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో ముందుభాగం పూర్తిగా దెబ్బ‌తింది. ఈ ప్ర‌మాదం నుంచి రామ‌కృష్ణ క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 10లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స‌మాచారం. యాక్సిడెంట్ త‌ర్వాత కారును అక్క‌డే నిలిపివేసి రామ‌కృష్ణ వెళ్లిపోయిన‌ట్లు తెలిసింది. అయితే కారు ప్ర‌మాదం ఎ లా జ‌రిగింద‌న్న‌ది పూర్తిగా తెలియ‌రాలేదు.

కారు దెబ్బ‌తిన్న ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని తెలిసింది. కాగా నంద‌మూరి ఫ్యామిలీలో రోడ్డు ప్ర‌మాదాలు తీర‌ని విషాదాల్ని మిగిల్చాయి.

నంద‌మూరి హ‌రికృష్ణ‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు జాన‌కీరామ్ రోడ్డు ప్ర‌మాదంలోనే క‌న్నుమూశారు. అందుకే త‌మ ప్ర‌తి సినిమా వేడుక‌లో ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ రోడ్డు ప్ర‌మాదాల బారిన ప‌ట్ట అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉంటారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.