తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 6 Telugu Trp Rating: బిగ్‌బాస్ 6 ఫస్ట్ ఎపిసోడ్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ - బిగ్‌బాస్ కెరీర్‌లో ఇదే లోయెస్ట్

Bigg Boss 6 Telugu Trp Rating: బిగ్‌బాస్ 6 ఫస్ట్ ఎపిసోడ్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ - బిగ్‌బాస్ కెరీర్‌లో ఇదే లోయెస్ట్

16 September 2022, 6:30 IST

  • Bigg Boss 6 Telugu Trp Rating: ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 6 మొదలైంది. ఈ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ కు లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. గత సీజన్స్ తో పోలిస్తే చాలా తక్కువ టీఆర్‌పీ రేటింగ్ కావడం గమనార్హం. 

నాగార్జున
నాగార్జున (Twitter)

నాగార్జున

Bigg Boss 6 Telugu Trp Rating: తెలుగులో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ రియాలిటీషోస్‌ల‌లో బిగ్‌బాస్ ఒక‌టిగా నిలిచింది. ఐదు సీజ‌న్స్‌తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బిగ్‌బాస్ అంతులేని వినోదాన్ని పంచింది. ఇటీవ‌లే బిగ్‌బాస్ ఆర‌వ సీజ‌న్ మొద‌లైంది. మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున (Nagarjuna) మ‌రోసారి ఆరవ సీజన్ కోసం మరోసారి ఆ పాత్రలో కనిపించబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

ఈ షోకు ఇప్ప‌టికే ప‌ది ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకున్న‌ది. తొలిరోజు నుంచే కంటెస్టెంట్స్ ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయిస్తూ ఆట‌లో దూసుకుపోతున్నారు. కాగా బిగ్‌బాస్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు ఊహించ‌ని రీతిలో లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది.ఓపెనింగ్ డే ఎపిసోడ్ లో రణ్ భీర్ కపూర్, అలియాభట్ గెస్ట్ లుగా వచ్చి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. అయినా కేవ‌లం 8.86 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే సాధించింది. ఆరు సీజ‌న్స్‌లో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు వ‌చ్చిన లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాలుగోసీజ‌న్ ఫస్ట్ ఎపిసోడ్ హ‌య్యెస్ట్‌గా 18.5 టీఆర్‌పీ రేటింగ్స్‌తో టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఫ‌స్ట్ ఎపిసోడ్ 17.9 టీఆర్‌ప్ రేటింగ్ ద‌క్కించుకున్న‌ది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజ‌న్ వ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్ 16.8 టీఆర్‌పీ రేటింగ్ సాధించింది. అందులో స‌గం మాత్ర‌మే సీజ‌న్ 6 ఫస్ట్ ఎపిసోడ్ కు రావ‌డం షాక్‌కు గురిచేస్తోంది.

జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌ని కంటెస్టెంట్స్ కావ‌డం, బిగ్ బాస్ నాన్ స్టాప్ కు, సీజన్ 6 కు మధ్య గ్యాప్ ఎక్కువగా లేకపోవడమే టీఆర్‌పీ రేటింగ్ తగ్గడానికి కారణమని చెబుతున్నారు. బిగ్‌బాస్ సీజ‌న్ 6లో రేవంత్‌, శ్రీహాన్, కీర్తిభ‌ట్‌, సుదీప‌, బాలాదిత్య‌, సింగ‌ర్ రేవంత్‌, ఆదిరెడ్డి, రాజ‌శేఖ‌ర్‌, ఆర్జే సూర్య‌, అభిన‌య‌శ్రీ, ఫైమా, చ‌లాకీ చంటి, అర్జున్ క‌ళ్యాణ్‌, రోహిత్ మ‌రీనా, ఇనాయా సుల్తానా, గీతూ రాయ‌ల్, షానీ సాల్మ‌న్, నేహా కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు. తొలి వారంలో ఎలిమినేషన్ నుంచి నుంచి మిన‌హాయింపు ఇచ్చాడు బిగ్ బాస్.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.