తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Na Roja Nuvve Song Lyrics: నా రోజా నువ్వే.. ఖుషీ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే.. మీరూ హమ్ చేయండి

Na Roja Nuvve Song lyrics: నా రోజా నువ్వే.. ఖుషీ ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే.. మీరూ హమ్ చేయండి

Hari Prasad S HT Telugu

19 May 2023, 15:10 IST

google News
    • Na Roja Nuvve Song lyrics: నా రోజా నువ్వే అంటూ ఖుషీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ఇవే. ఈ లిరిక్స్ చూసి మీరూ ఈ పాటను హమ్ చేయొచ్చు. విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఖుషీలో నటించిన విషయం తెలిసిందే.
ఖుషీ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత
ఖుషీ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత

ఖుషీ మూవీలో విజయ్ దేవరకొండ, సమంత

Na Roja Nuvve Song lyrics: విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ మూవీ నుంచి మంగళవారం (మే 9) ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే వచ్చిన విషయం తెలుసు కదా. విజయ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్ ను ఈ లిరికల్ సాంగ్ తో సర్‌ప్రైజ్ చేశారు. ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. ఇందులో విజయ్, సామ్ జోడీ కూడా అభిమానులను ఆకర్షించేలా ఉంది.

పూర్తిగా డైరెక్టర్ మణిరత్నం సినిమా టైటిల్స్ తో ఈ పాట లిరిక్స్ రాయడం విశేషం. మరి ఈ పాటను మీరు కూడా పాడాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇక్కడ నా రోజా నువ్వే సాంగ్ పూర్తి లిరిక్స్ ఇస్తున్నాం. ఆ లిరిక్స్ చూస్తూ మీరూ హమ్ చేయండి.

నా రోజా నువ్వే లిరిక్స్

ఆరా...

ఆరా...

ఆరా...

తననననా

తననననా

తనననా

పల్లవి:

ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..

బేగం బేజారూ..

ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

దిల్ మాంగే మోరూ..

ఈ ప్రేమే వేరూ..

హుక్‌లైన్ 1

నా రోజా నువ్వే...

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

చరణం 1:

నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే..

నా అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే..

నా సఖివీ నువ్వేలే.. నీ దళపతిని నేనేలే..

నా చెలియా నువ్వేలే.. నీ నాయకుడు నేనే..

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా.. నో అంటే నో అంట..

ఓకే బంగారం..

హుక్‌లైన్ 2:

నా రోజా నువ్వే...

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

చరణం 2:

నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా..

నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా..

నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో..

నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై..

నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంట..

ఓకే నా బేగం..

పల్లవి రిపీట్:

ఆరా సే ప్యారూ..

అందం తన ఊరు..

సారే హుషారు..

బేగం బేజారూ..

హుక్‌లైన్ 3:

నా రోజా నువ్వే...

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

నా రోజా నువ్వే..

నా దిల్సే నువ్వే..

నా అంజలి నువ్వే..

గీతాంజలి నువ్వే..

తదుపరి వ్యాసం