తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha On Citadel: సిటడెల్ రీమేక్ కాదు.. క్లారిటీ ఇచ్చిన సమంత

Samantha on Citadel: సిటడెల్ రీమేక్ కాదు.. క్లారిటీ ఇచ్చిన సమంత

07 May 2023, 14:24 IST

google News
    • Samantha on Citadel: ఇండియన్ వెర్షన్ సిటడెల్‌ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌ రీమేక్ కాదంటూ సమంత క్లారిటీ ఇచ్చింది. నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చింది.
సిటడెల్ రీమేక్ కాదని క్లారిటీనిచ్చిన సమంత
సిటడెల్ రీమేక్ కాదని క్లారిటీనిచ్చిన సమంత

సిటడెల్ రీమేక్ కాదని క్లారిటీనిచ్చిన సమంత

Samantha on Citadel: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటడెల్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్ కోసం సామ్ చెమటలు చిందిస్తోంది. రిస్కీ స్టంట్ల కోసం భారీగ కసరత్తులు చేస్తోంది. అయితే ఇప్పటికే హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా-రిచర్డ్ మ్యాడెన్ నటించిన సిటడెల్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ప్రేక్షాదరణ పొందుతోది. దీంతో మళ్లీ ఈ సిరీస్‌ను రీమేక్ చేయడం ఎందుకని చాలా మంది నెటిజన్లు సమంతను ప్రశ్నిస్తున్నారు.

ఇందులో భాగంగా ఓ యూజర్.. "ప్రియాంక చోప్రా నటించిన సిటడెల్ తెలుగులోనూ విడుదలైంది. అందరూ చూశారు కదా.. మళ్లీ మీరు దాన్ని ఎందుకు రీమేక్ చేస్తున్నారు?" అంటూ ప్రశ్నించారు. ఇందుకు సామ్ స్పందిస్తూ.. ఇది రీమేక్ కాదంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ కామెంట్‌పై మరోయూజర్ స్పందిస్తూ.. "సిటడెల్ అన్ని దేశ భాషల్లోనూ తెరకెక్కుతోంది. ఇండియన్ వెర్షన్‌లో సమంత, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రాంతానికి తగినట్లుగా సిరీస్‌లో మార్పులు చేస్తున్నారు." అని పోస్ట్ పెట్టారు. దీనికి సమంత లైక్ కొట్టింది.

హాలీవుడ్ సిటడెల్ వెర్షన్‌ను రూసో బ్రదర్స్ తెరకెక్కించగా.. ఇందులో ప్రియాంక చోప్రా-రిచడ్ మ్యాడెన్ కీలక పాత్రల్లో నటించారు. ఇండియన్ వెర్షన్‌కు ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సమంతతో పాటు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ మొదలు కాగా.. త్వరలోనే ఈ సిరీస్ విడుదలపై సిటడెల్ టీమ్ క్లారిటీ ఇవ్వనుంది.

మరోపక్క సమంత వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే లవ్ స్టోరీలో నటిస్తోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మిగత భాగాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

తదుపరి వ్యాసం