Citadel Budget: సిటడెల్ సిరీస్ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఒక్కో ఎపిసోడ్‌కే కొన్ని వందల కోట్లు-citadel budget makes it second most expensive show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Citadel Budget Makes It Second Most Expensive Show

Citadel Budget: సిటడెల్ సిరీస్ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఒక్కో ఎపిసోడ్‌కే కొన్ని వందల కోట్లు

Hari Prasad S HT Telugu
Apr 28, 2023 06:45 PM IST

Citadel Budget: సిటడెల్ సిరీస్ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఒక్కో ఎపిసోడ్‌కే కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు. దీంతో ఇది ప్రపంచంలనే రెండో అత్యధిక బడ్జెట్ కలిగిన షోగా రికార్డు క్రియేట్ చేసింది.

సిటడెల్ నటీనటులు రిచర్డ్ మాడెన్, ప్రియాంకా చోప్రా
సిటడెల్ నటీనటులు రిచర్డ్ మాడెన్, ప్రియాంకా చోప్రా (AP)

Citadel Budget: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా నటించిన సిటడెల్ వెబ్ సిరీస్ శుక్రవారం (ఏప్రిల్ 28) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఈ వారం తొలి రెండు ఎపిసోడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సిరీస్ కు మొత్తం నెగటివ్ రివ్యూలే వస్తున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన సిరీస్ కావడంతో మేకర్స్ తీవ్రంగా నష్టపోతారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అమెజాన్ స్టూడియోస్ ఈ సిరీస్ ను తెరకెక్కించింది. ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మాడెన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ కోసం ఏకంగా 30 కోట్లకుపైగా డాలర్లు (సుమారు రూ.2500 కోట్లు) ఖర్చు చేయడం విశేషం.

ప్రైమ్ వీడియో నిర్మించిన లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ తర్వాత రెండో అత్యధిక బడ్జెట్ కలిగిన షోగా సిటడెల్ నిలిచింది. నిజానికి ఈ స్థాయి బడ్జెట్ ముందుగా అనుకోలేదు. కానీ ఈ సిరీస్ లో స్టంట్స్ ను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి మేకర్స్ చాలా సీన్లను రీషూట్ చేశారు. దీంతో బడ్జెట్ ఊహించినదాని కంటే ఎక్కువైంది.

ఒక్కో ఎపిసోడ్ కే 5 కోట్ల డాలర్లు ఖర్చు చేయడం విశేషం. 2021, డిసెంబర్ లో ఈ షో నుంచి జోష్ ఆపిల్‌బామ్ తప్పుకోవడంతో అతని స్థానంలో డేనియల్ వీల్ ను తీసుకొచ్చారు. దీనివల్ల మేకర్స్ కు నష్టాలు తప్పలేదు. జో రుసో చాలా వరకూ షాట్లను రీషూట్ చేయడంతో ఖర్చు తడిసి మోపెడైనట్లు సిటడెల్ సిరీస్ వర్గాలు.. హాలీవుడ్ రిపోర్టర్ కు వెల్లడించాయి.

నిజానికి సిటడెల్ ను మొదట 8 ఎపిసోడ్లుగా తీసుకురావాలని, ఒక్కో ఎపిసోడ్ గంట వరకూ ఉండాలని అనుకున్నారు. కానీ ప్రైమ్ వీడియో దానిని 6 ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలకు కుదించింది. జో, ఆంటోనీ రుసోలు ప్రొడ్యూస్ చేసిన ఈ సిరీస్ కు ఊహించిన రెస్పాన్స్ రాలేదు. దీంతో తర్వాతి ఎపిసోడ్లపై ముందుగానే ప్రేక్షకులకు ఆసక్తి లేకుండా పోయింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం