Prime Video New Feature: ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్.. ఇక డైలాగులు స్పష్టంగా వినిపిస్తాయ్-prime video new feature called dialogue boost to let audience experience better quality dialogues ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prime Video New Feature: ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్.. ఇక డైలాగులు స్పష్టంగా వినిపిస్తాయ్

Prime Video New Feature: ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్.. ఇక డైలాగులు స్పష్టంగా వినిపిస్తాయ్

Hari Prasad S HT Telugu
Apr 20, 2023 02:09 PM IST

Prime Video New Feature: ప్రైమ్ వీడియోలో కొత్త ఫీచర్ వచ్చేసింది దీని ద్వారా ఇక డైలాగులు స్పష్టంగా వినిపిస్తాయి. ఈ ఫీచర్ ను తొలిసారి తామే తీసుకువచ్చినట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది.

ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన డైలాగ్ బూస్ట్ ఫీచర్
ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన డైలాగ్ బూస్ట్ ఫీచర్

Prime Video New Feature: సినిమా లేదంటే వెబ్ సిరీస్ చూసే సమయంలో మ్యూజిక్ వచ్చినప్పుడు పెద్ద సౌండ్ రావడం.. డైలాగ్స్ మాత్రం అసలు వినిపించకపోవడం.. ఏదో ఒక సమయంలో ఇది అందరికీ జరిగేదే. అయితే దీనికి చెక్ పెట్టడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని పేరు డైలాగ్ బూస్ట్. దాని పేరులో ఉన్నట్లే ఈ ఫీచర్ ద్వారా డైలాగ్స్ వచ్చినప్పుడు వాటిని స్పష్టంగా వినేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అమెజాన్ ఒరిజినల్స్ చూసే వారికి ఈ డైలాగ్ బూస్ట్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎఫెక్ట్స్ ను బట్టి డైలాగ్ సౌండ్ లో మార్పులు చేసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని సెక్షన్ల ఒరిజినల్స్ లో మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది.

నిజానికి కాస్త వినికిడి లోపం ఉన్నవాళ్ల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఫీచర్ తీసుకొచ్చినా.. దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఈ డైలాగ్ బూస్ట్ ఫీచర్ ఓ సినిమా లేదా సిరీస్ లోని ఒరిజినల్ ఆడియోను విశ్లేషించి, అందులో సరిగా వినిపించని డైలాగులను గుర్తిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎఫెక్ట్స్ కు తగినట్లు ఆ డైలాగ్ వాల్యూమ్ ని పెంచుతుంది.

నిజానికి ప్రైమ్ వీడియలోనే కాదు ఇతర ఓటీటీల్లోనూ ఈ ఫీచర్ ఉంటే బాగుంటుంది. డైలాగులు సరిగా వినిపించక వాల్యూమ్ పెంచే సమయంలో మ్యూజిక్ వస్తే అది మరింత గట్టిగా వినిపించడం సాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఈ డైలాగ్ బూస్ట్ లాంటి ఫీచర్ యూజర్లకు చాలా సాయం చేస్తుందనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఇంగ్లిష్ లాంగ్వేజ్ అమెజాన్ ఒరిజినల్స్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని టైటిల్స్ కు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం