Amazon mini TV Web Series: అమెజాన్ మినీ టీవీలో బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ యూత్ మెచ్చేవే-amazon mini tv web series to binge watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amazon Mini Tv Web Series: అమెజాన్ మినీ టీవీలో బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ యూత్ మెచ్చేవే

Amazon mini TV Web Series: అమెజాన్ మినీ టీవీలో బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే.. అన్నీ యూత్ మెచ్చేవే

Hari Prasad S HT Telugu
Published Apr 17, 2023 03:29 PM IST

Amazon mini TV Web Series: అమెజాన్ మినీ టీవీలో బెస్ట్ వెబ్ సిరీస్ ఇవే. ఇవన్నీ యూత్ మెచ్చేవే కావడం విశేషం. ఈ మినీ టీవీ సిరీస్ ను అందరూ ఫ్రీగా చూసే అవకాశం ఉండటం మరో విశేషం.

అమెజాన్ మినీ టీవీలోని ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్
అమెజాన్ మినీ టీవీలోని ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్

Amazon mini TV Web Series: అమెజాన్ యాప్ యూజ్ చేస్తారా? అందులో మినీ టీవీ(Amazon mini TV)ని ఎప్పుడైనా చూశారా? ఇదొక ఫ్రీ ఓటీటీ ప్లాట్‌ఫామ్. ఇందులోని వెబ్ సిరీస్, మినీ మూవీస్ ని ఎవరైనా ఫ్రీగా చూసే అవకాశం ఉంటుంది. మొబైల్ లో అయితే అమెజాన్ యాప్ లోకి వెళ్లి చూడొచ్చు. డెస్క్‌టాప్ లో అయితే మినీ టీవీ వెబ్ సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.

ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగా ఎన్నో వెబ్ సిరీస్, మినీ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ యువతను లక్ష్యంగా చేసుకొని తీసినవే కావడం విశేషం. ముఖ్యంగా టీనేజర్లు, కాలేజ్ స్టూడెంట్స్ మెచ్చే ఎన్నో సిరీస్ ఇందులో ఉన్నాయి. మరి మినీ టీవీ(Amazon mini TV)లోని బెస్ట్ వెబ్ సిరీస్ ఏవో తెలుసుకోండి.

ఇష్క్ ఎక్స్‌ప్రెస్ (Ishq Express)

అమెజాన్ మినీ టీవీ (Amazon mini TV)లోని బెస్ట్ వెబ్ సిరీస్ లో ఈ ఇష్క్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. రైల్లో కలిసిన ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే లవ్ స్టోరీ ఇది. అనుకోకుండా రైల్లో ఒకే బెర్త్ షేర్ చేసుకోవాల్సి రావడంతో ఇబ్బంది పడే తాన్యా, ఆరవ్.. తర్వాత ఎలా ప్రేమలో పడతారన్నదే ఈ ఇష్క్ ఎక్స్‌ప్రెస్. ప్రస్తుతం ఈ సిరీస్ లో మూడు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి.

క్రష్‌డ్ (Crushed)

అమెజాన్ మినీ టీవీలోని మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఇది. లక్నో సెంట్రల్ కాన్వెంట్ స్టూడెంట్స్ అయిన ఆద్య, సంవిధాన్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ యువతను బాగా ఆకర్షిస్తోంది.

ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ (Please Find Attached)

ఓ స్టార్టప్ లో కొలీగ్స్, రూమ్ మేట్స్ అయిన సాన్యా, శౌర్య మధ్య జరిగే లవ్ స్టోరీయే ఈ ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్. తమ ఆఫీస్ కి దగ్గర కావడంతో ఈ ఇద్దరూ ఒకే గదిలో ఉంటారు. ఆ తర్వాత వీళ్లు లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వెళ్తారు. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, ఇల్లు, ఆఫీస్ లో ఎదురయ్యే ఇబ్బందులు ఈ సిరీస్ లో చూడొచ్చు.

ఫిజిక్స్ వాలా (Physics Wallah)

అమెజాన్ మినీ టీవీ (Amazon mini TV) బెస్ట్ వెబ్ సిరీస్ లో ఇదీ ఒకటి. ఇదొక నిజ జీవిత సక్సెస్ స్టోరీ. బడా ఎడ్‌టెక్ కంపెనీని ఎదురించి సక్సెస సాధించిన ఫిజిక్స్ వాలా అనే ఎడ్ టెక్ కంపెనీ సీఈవో అలఖ్ పాండే జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఆస్పిరెంట్స్ (Aspirants)

సివిల్స్ సాధించాలని కలలు కనే ముగ్గురు ఫ్రెండ్స్ అభిలాష్, గురి, ఎస్‌కే చుట్టూ తిరిగే కథే ఆస్పిరెంట్స్ (Aspirants). మినీ టీవీలోని బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటి. తమ లక్ష్యాన్ని సాధించడానికి ఈ ముగ్గురూ పడే శ్రమ, ఎదుర్కొనే సవాళ్లు, సివిల్స్ కోచింగ్ సెంటర్ల తీరుపై ఈ సిరీస్ తెరకెక్కింది.

ఇవే కాకుండా మినీ టీవీలో సిక్సర్ (Sixer), అడల్టింగ్ (Adulting), యే మేరీ ఫ్యామిలీ (Yeh Meri Family), పర్మనెంట్ రూమ్మేట్స్ (Permanent Roommates), మర్డర్ ఇన్ అగోడా (Murder in Agoda), డ్యూడ్ (Dude), ట్రిప్లింగ్ (Tripling) లాంటి సిరీస్ కూడా బింజ్ వాచ్ చేయొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం