Aishwarya Rai On Mani Ratnam: మణిరత్నం పాదాలు తాకిన ఐశ్వర్య రాయ్.. అందాల భామపై దర్శకుడు ప్రశంసల వర్షం-aishwarya rai touches mani ratnam feet in ponniyin selvan 2 promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Aishwarya Rai Touches Mani Ratnam Feet In Ponniyin Selvan 2 Promotions

Aishwarya Rai On Mani Ratnam: మణిరత్నం పాదాలు తాకిన ఐశ్వర్య రాయ్.. అందాల భామపై దర్శకుడు ప్రశంసల వర్షం

Maragani Govardhan HT Telugu
Apr 26, 2023 11:33 AM IST

Aishwarya Rai On Mani Ratnam: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్.. దర్శక దిగ్గజం మణిరత్నం పాదాలను తాకింది. పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్లలో భాగంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించిన మణిరత్నంపై తన అభిమానాన్ని చాటుకుంది ఈ అందాల భామ.

మణిరత్నం పాదాలు తాకిన ఐశ్వర్య రాయ్
మణిరత్నం పాదాలు తాకిన ఐశ్వర్య రాయ్

Aishwarya Rai On Mani Ratnam: మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ప్రచారాన్ని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారు. ముంబయిలో మంగళవారం నాడు ఓ ఈవెంట్ నిర్వహించింది చితరబృందం. ఈ కార్యక్రమానికి మణిరత్నం సహా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఐశ్వర్య రాయ్, విక్రమ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఐశ్వర్య రాయ్.. మణిరత్నం కాళ్లను తాకింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

ఐశ్వర్య రాయ్‌ నటన, అందం గురించి మాట్లాడిన మణిరత్నం.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. "ఫిల్మ్ మేకర్స్ ఎంతో స్వార్థపరులు. వారు సినిమాను మాత్రమే పట్టించుకుంటారు. నేను ఐశ్వర్యను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆ పాత్రకు ఆమె సరైనదని అనిపిస్తే మాత్రమే నేను అడుగుతాను. అందుకు ఆమె వెంటనే అవును అని చెప్పేంత మంచి వ్యక్తి." అని మణిరత్నం అన్నారు. దర్శకుడి మాటలకు పొంగిపోయిన ఐశ్వర్య.. వెంటనే లేచి ఆయన పాదాలను తాకింది.

అంతకుముందు మణిరత్నంను చూసిన ఐశ్వర్య.. హౌగ్ ఇచ్చి కెమెరాకు ఫోజిచ్చింది. ఇరువార్ సినిమాతో తమిళంలో ఐశ్వర్యా రాయ్‌ను మణిరత్నమే పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్ అనార్కలీలో మెరిసింది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ -2లో విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై మణిరత్నం ఈ మూవీకి దర్శకత్వం వహించారు. పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్‌గా ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గతేడాది విడుదలైన మొదటి భాగం తమిళంలో సూపర్ హిట్‌గా నిలవగా.. మిగిలిన భాషళ్లో ఓ మోస్తరు కలెక్షన్లతో ఆకట్టుకుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.