Notices To Aishwarya Rai : ల్యాండ్ ట్యాక్స్ కట్టని ఐశ్వర్య రాయ్.. అధికారుల నోటీసులు-actress aishwarya rai received notices for non payment of land tax in nashik
Telugu News  /  Entertainment  /  Actress Aishwarya Rai Received Notices For Non Payment Of Land Tax In Nashik
పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్
పొన్నియిన్ సెల్వన్ లో ఐశ్వర్య రాయ్ (Twitter)

Notices To Aishwarya Rai : ల్యాండ్ ట్యాక్స్ కట్టని ఐశ్వర్య రాయ్.. అధికారుల నోటీసులు

17 January 2023, 20:18 ISTAnand Sai
17 January 2023, 20:18 IST

Aishwarya Rai : హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. నాసిక్ పరిధిలో ఐశ్వర్య పేరిట ఉన్న భూమికి ల్యాండ్ ట్యాక్స్ కట్టడం లేదట.. దీంతో అధికారులు నోటీసులు ఇచ్చారు.

నాసిక్‌లో తనకున్న భూమికి పన్ను చెల్లించలేదని ఐశ్వర్యరాయ్‌కు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని సిన్నార్‌లో ఐశ్వర్య రాయ్ పేరిట హెక్టారు భూమి ఉంది. భూమి పన్ను ఒక సంవత్సరం నుండి చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని సంబంధిత అధికారులు ఐశ్వర్యకు నోటీసులు పంపారు. అనేకసార్లు పన్నుకు సంబంధించి.. అధికారులు రిమైండర్‌లు చేశారు. సంవత్సర కాలంగా.. భూమికి పన్ను చెల్లించలేదు. దీంతో సిన్నార్ తహసీల్దార్ ఐశ్వర్యకు నోటీసులు పంపారు.

ఐశ్వర్య రాయ్ రూ.21,960 భూమి పన్ను చెల్లించాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. 10 రోజులలోపు చెల్లించకపోతే, మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం, 1966లోని సెక్షన్ 174 ప్రకారం ఐశ్వర్యపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నరట.

ఆ ఏరియాలో ఐశ్వర్య రాయ్‌కి మాత్రమే కాదు.. భూములు ఉన్న చాలా మంది ల్యాండ్ ట్యాక్స్‌ని ఏడాదికాలంగా కట్టడం లేదని తెలుస్తోంది. మెుత్తం 1200 మంది భూ యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. జనవరి 9న నోటీసు జారీ చేశారు. అయితే ఐశ్వర్య రాయ్ నోటీసులపై మాత్రం స్పందించలేదు. సిన్నార్‌లోని 1200 మంది ఆస్తి యజమానులలో ఐశ్వర్య ఒకరు, పన్నులను చెల్లించనందుకు ఈ నోటీసులు పంపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (మార్చి చివరి నాటికి) బకాయిలన్నీ వసూలు చేయాలని మహారాష్ట్రలోని భూ రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఐశ్వర్యతోపాటుగా మరికొంతమంది సెలబ్రెటీలు, బిజినెస్ మెన్స్ కు భూములు కూడా ఉన్నాయని టాక్.

ఐశ్వర్య కిందటి ఏడాది మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో కనిపించింది. కార్తీ, విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య తదితరులు నటించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని సీక్వెల్, పొన్నియిన్ సెల్వన్ 2 , ఏప్రిల్ 2023లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య కూడా ఉంటుంది.