తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kushi First Single: విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్ - ఖుషి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్‌

Kushi First Single: విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్ - ఖుషి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్‌

09 May 2023, 11:17 IST

  • Kushi First Single: విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్‌డే కానుక‌గా ఖుషి సినిమాలోని ఫ‌స్ట్‌సింగిల్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. మెలోడీ ప్ర‌ధానంగా సాగిన ఈ పాట విజ‌య్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత

Kushi First Single: విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అత‌డి అభిమానుల‌కు ఖుషి సినిమా యూనిట్ స్వీట్‌ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. నా రోజా నువ్వే అంటూ మెలోడీ ప్ర‌ధానంగా సాగిన ఈ పాట అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

ఈ పాట‌ను డైరెక్ట‌ర్ శివ నిర్వాణ రాయ‌డం గ‌మ‌నార్హం. హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ మ్యూజిక్ అందిస్తూ ఈ ల‌వ్ సాంగ్‌ను ఆల‌పించారు. మ‌ల‌యాళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన హీష‌మ్ ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నా రోజు నువ్వే పాట‌లో స‌మంత ముస్లిం యువ‌తిగా క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. క‌శ్మీర్ అందాల న‌డుమ ఈ పాట‌ను పిక్చ‌రైజ్ చేశారు.

మంచు కొండ‌ల్లో స‌మంత‌ అందాల‌తో చూసి విజ‌య్ మెస్మ‌రైజ్ అయ్యే సంద‌ర్భంలో సినిమాలో ఈ పాట ఉండ‌బోతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ పాట‌లో విజ‌య్‌, స‌మంత కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటోంది. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

నేటి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ కొచ్చిలో ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు ఇత‌ర భాష‌ల్లో రిలీజ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం