తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Trending: ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ సినిమా.. టాప్ 1లో ట్రెండింగ్.. ఎక్కడ చూస్తారంటే?

OTT Trending: ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోన్న కామెడీ సినిమా.. టాప్ 1లో ట్రెండింగ్.. ఎక్కడ చూస్తారంటే?

Sanjiv Kumar HT Telugu

21 April 2024, 8:44 IST

  • My Dear Donga OTT Response: కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా తెరకెక్కిన సినిమా మై డియర్ దొంగ. ఏప్రిల్ 19న ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌క వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటూ టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోన్న కొత్త కామెడీ సినిమా.. టాప్ 1లో ట్రెండింగ్.. ఎక్కడ చూస్తారంటే?
ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోన్న కొత్త కామెడీ సినిమా.. టాప్ 1లో ట్రెండింగ్.. ఎక్కడ చూస్తారంటే?

ఓటీటీలో కడుపుబ్బా నవ్విస్తోన్న కొత్త కామెడీ సినిమా.. టాప్ 1లో ట్రెండింగ్.. ఎక్కడ చూస్తారంటే?

My Dear Donga OTT Release: ఓటీటీలో ఎన్నో సినిమాలు అలరించేందుకు రిలీజ్ అయి సందడి చేస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ఆ జోనర్‌కు తగిన రీతిలో ఎంటర్టైన్ చేస్తాయి. అలా తాజాగా కామెడీ జోనర్‌లో వచ్చిన ఓ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. దాంతో ఓటీటీలో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది ఆ మూవీ.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

కామెడీ జోనర్‌లో

ఆ సినిమా పేరే మై డియర్ దొంగ. కమెడియన్ అభినవ్ గోమఠం హీరోగా రూపొందిన సినిమానే మై డియర్ దొంగ. కామెడీ జోనర్‌గా వచ్చిన ఈ సినిమాలో శాలిని కొండెపూడి, సుందరం మాస్టర్ ఫేమ్ దివ్య శ్రీపాదతోపాటు నిఖిల్ గాజుల, శశాంక్ కొత్త నటులు యాక్ట్ చేశారు. వీరితోపాటు ఫస్ట్ డే ఫస్ట్ షో డైరెక్టర్ అండ్ యాక్టర్ వంశీధర్ గౌడ్ సైతం నటించి మెప్పించారు.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

మై డియర్ దొంగకు శాలిని స్వీయ రచన చేయగా.. బీఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. అప్పటికే ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా బాగా అట్రాక్ట్ చేసిన మై డియర్ దొంగ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌కు విడుదలైంది.

టాప్ 1లో ట్రెండింగ్

ఏప్రిల్ 19 నుంచి ఆహాలో మై డియర్ దొంగ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తొలి రోజు నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం మొదలైంది. దాంతో ఇప్పుడు ఆహా ఓటీటీ టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లో నిలిచింది మై డియర్ దొంగ సినిమా. సినిమాకు ప్రధాన హైలెట్‌గా శాలిని కొండెపూడి రచన అని రివ్యూలు చెబుతున్నాయి.

మెచ్చుకునేలా రైటింగ్స్, డైలాగ్స్

సినిమాలో అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, శాలిని రైటింగ్స్, డైలాగ్స్ బాగా మెప్పించేలా ఉన్నాయని సమాచారం. ఇక ఓ కీలక పాత్రలో నటించిన వంశీధర్ గౌడ్ నటన కూడా బాగా అట్రాక్ట్ చేస్తోందని తెలుస్తోంది. సినిమాలో కెమెరాకు చూస్తూ, ఈతరం అమ్మాయిలా బిహేవ్ చేసే సుజాతగా శాలిని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ బాగా ఆకట్టుకున్నట్లు టాక్.

అంతా ఇగ్నోర్ చేసిన అమ్మాయికి

లవర్, బెస్ట్ ఫ్రెండ్ ఇలా అందరూ ఇగ్నోర్ చేస్తున్న ఓ అమ్మాయికి ఇంట్లో పడిన దొంగతో పరిచయం ఎలా అయింది?. అసలు దొంగతో ఆ అమ్మాయి ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేసింది? వారి ఫ్రెండ్‌షిప్ తన లవ్ రిలేషన్‌షి‌ప్‌పై ఎలాంటి ప్రభావం చూపింది? ఆ యువతికి ఉన్న కుటుంబ నేపథ్యం ఏంటీ అనే అన్ని విషయాలను కామెడీగానే చూపించారు.

గంట 40 నిమిషాల రన్ టైమ్

ఇలా గంట 40 నిమిషాలు ఉన్న మై డియర్ దొంగ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నట్లు రివ్యూలు చెబుతున్నాయి. ఈ సినిమాను ఇంకా చూడనివారు ఈ వీకెండ్‌కు ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. ఉండి ఉండనట్లుగా ఉన్న ఓ లిప్ లాక్ సీన్ మాత్రం కాస్తా ఇబ్బందిపెట్టవచ్చు. ఈ సీన్‌ను గమనించేలోపే పూర్తయిపోతుంది కాబట్టి.. కుటుంబంతో కలిసి హ్యాపీగా మై డియర్ దొంగ చూసేయొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం