Keerthy Suresh Lip Lock: తమిళ రీమేక్ మూవీలో కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్స్? మారిపోయిన మహానటి! ఫ్యాన్స్‌కు షాక్-keerthy suresh lip lock with varun dhawan in baby john movie keerthy suresh lip kiss in bollywood movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keerthy Suresh Lip Lock: తమిళ రీమేక్ మూవీలో కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్స్? మారిపోయిన మహానటి! ఫ్యాన్స్‌కు షాక్

Keerthy Suresh Lip Lock: తమిళ రీమేక్ మూవీలో కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్స్? మారిపోయిన మహానటి! ఫ్యాన్స్‌కు షాక్

Sanjiv Kumar HT Telugu
Feb 22, 2024 10:25 AM IST

Keerthy Suresh Lip Lock With Varun Dhawan: మహానటి కీర్తి సురేష్ తొలిసారిగా హద్దులు చెరిపేసి ముద్దులు పెట్టనుందని ఓ వార్త వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ లేటెస్ట్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో లిప్ లాక్ సీన్లలో నటించనుందని టాక్ నడుస్తోంది.

తమిళ రీమేక్ మూవీలో కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్స్? హద్దులు చెరిపేసిన మహానటి! ఫ్యాన్స్‌కు షాక్
తమిళ రీమేక్ మూవీలో కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్స్? హద్దులు చెరిపేసిన మహానటి! ఫ్యాన్స్‌కు షాక్

Keerthy Suresh Lip Kiss Scene: ముద్దుగుమ్మ కీర్తి సురేష్ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. దక్షిణాదిలో కీర్తి సురేష్‌కు మహానటి అని పేరు కూడా ఉంది. సౌత్ సినీ ప్రేక్షకులు, అభిమానులు కీర్తి సురేష్‌ను మహానటిగా అభివర్ణిస్తూ ప్రేమ, అభిమానం కురిపిస్తుంటారు. ఇటీవల తెలుగులో దసరా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టింది కీర్తి సురేష్. దసరా మూవీలో మేకప్ లేకుండా నటించి వెన్నెల పాత్రలో జీవించి ప్రశంసలు అందుకుంది.

హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు చేయకుండా డీ గ్లామర్ రోల్స్ చేస్తూ ఆకర్షించింది కీర్తి సురేష్. అలాగే హీరోయిన్‌గానే కాకుండా కీలక పాత్రల్లో నటిస్తూ ఆశ్చర్యపరిచింది. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటించి అలరించింది కీర్తి సురేష్. ప్రస్తుతం తమిళంలో సైరన్ అనే మూవీతో సందడి చేస్తోంది. ఫిబ్రవరి 16న తమిళంలో విడుదలైన సైరన్ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కీర్తి సురేష్ కనిపించింది.

ఈ సైరన్ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు మేకర్స్. కీర్తి సురేష్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఉండటంతో సైరన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గంగా ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ విడుదల చేస్తోంది. సైరన్ మూవీ తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక నుంచి నార్త్ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకోనుంది.

కీర్తి సురేష్ నార్త్‌లో చేస్తున్న మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తేరికి రీమేక్‌గా బేబీ జాన్ తెరకెక్కుతోంది. బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా చేయగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. అయితే, ఇప్పటివరకు కీర్తి సురేష్ ఘాటు ముద్దు సీన్లే కాదు ఎక్స్‌పోజింగ్ కూడా చేయలేదు. ప్రతి సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించింది. ఇటీవల సర్కారు వారి పాట మూవీలో కొన్ని సీన్లలో మాత్రం కాస్తా గ్లామర్ ఒలకబోసింది కీర్తి సురేష్.

అంతకుమించి ఎక్కువగా డీ గ్లామర్ రోల్స్, ప్రాధన్యత ఉన్న పాత్రలు, లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది కీర్తి సురేష్. కానీ, తొలిసారిగా ఇప్పటివరకు పెట్టుకున్న హద్దులు చెరిపేస్తూ ఘాటు ముద్దు సీన్లలో నటిస్తానని అంటోదట కీర్తి సురేష్. అలాగే అందాల ప్రదర్శన కూడా చేసేందుకు రెడీ అయిందట. ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్స్ చేయకపోతే బాలీవుడ్‌లో రాణించడం కష్టమని మహానటి ఫీల్ అవుతుందని పలు సైట్స్ పేర్కొంటున్నాయి.

నిజానికి బేబీ జాన్ సినిమా ప్రారంభంలో ఎలాంటి లిప్ లాక్ సీన్స్ లేవట. కానీ, డైరెక్టర్ ఉంటే బాగుంటుందని చెప్పారట. దానికి ముందు నో చెప్పిన కీర్తి సురేష్ తర్వాత లిప్ లాక్ సన్నివేశాలకు ఎస్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాల్లో లిప్ లాక్ సీన్స్ చేయని కీర్తి సురేష్ తాజాగా వరుణ్ ధావన్‌తో ముద్దు సన్నివేశాల్లో నటిస్తోందని తెలియడంతో ఆమె ఫ్యాన్స్ తెగ హర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

సౌత్‌లో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్‌కు వెళ్లగానే మారిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు, ఆమె అభిమానులు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు. దీనిపై కీర్తి సురేష్ స్పందించి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇక బేబి జాన్ మూవీ మే 31న రిలీజ్ కానుంది. కాగా, కీర్తి సురేష్ బేబీ జాన్ మాత్రమే కాకుండా హిందీలో అక్క అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇది ఓటీటీ వెబ్ సిరీస్. అలాగే రివాల్వర్ రీటా, రఘు తాత అనే సినిమాలు కూడా చేస్తోంది.

Whats_app_banner