(1 / 5)
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో మంజుమ్మల్ బాయ్స్ ఒకటి. చిదంబరం దర్శకత్వం వహించిన మంజుల బాయ్స్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సత్తా చాటింది.
(అన్ని ఫొటోలు @Instagram)(2 / 5)
మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు మలయాళంతోపాటు తమిళంలో వచ్చిన రెస్పాన్స్‌తో తెలుగులో కూడా థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మంజుమ్మల్ బాయ్స్ మంచి కలెక్షన్స్ సాధించింది.
(3 / 5)
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ మంజుమ్మల్ బాయ్స్ సినిమాను ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేసింది. సర్వ్వైల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు.
(4 / 5)
తమిళనాడులోని గుణ కేవ్స్‌కు సంబంధించిన యదార్థ సంఘటనల ఆధారంగా మంజుమ్మల్ బాయ్స్ సినిమాను తెరకెక్కించారు. సరదాగా వెళ్లిన స్నేహితులకు గుణ కేవ్స్ లో జరిగిన సంఘటనల ఆధారంగా సర్వైవల్ థ్రిల్లర్‌గా చిత్రీకరించారు.
(5 / 5)
మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఇతర గ్యాలరీలు