తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Heroine Remuneration: చేసింది ఒక్క సినిమా.. రెమ్యూనరేషన్ మాత్రం 3 కోట్లు.. భారీగా డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

Heroine Remuneration: చేసింది ఒక్క సినిమా.. రెమ్యూనరేషన్ మాత్రం 3 కోట్లు.. భారీగా డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!

19 March 2023, 18:37 IST

    • Heroine Remuneration: సీతారామం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందట. నానితో సినిమా కోసం 3 కోట్ల వరకు పారితోషికం అడిగిందని ఫిల్మ్ వర్గాల సమాచారం.
మృణాల్ ఠాకూర్‌
మృణాల్ ఠాకూర్‌

మృణాల్ ఠాకూర్‌

Heroine Remuneration: ఇండియన్ ఫిల్మ్ ఇండిస్ట్రీలో రైజింగ్ స్టార్‌గా దూసుకెళ్తోంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్‌లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ గతేడాది సీతారామం చిత్రంతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. సీత, ప్రిన్సెస్ నూర్జాహాన్ రెండు విభిన్న పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగువారికి బాగా దగ్గరైంది. మొదటి చిత్రంతోనే తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్‌లోనూ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సరసన ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం నాని చిత్రం కోసం మృణాల్ ఠాకూర్ రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందట. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా కోసం ఏకంగా రూ.3 కోట్ల వరకు పారితోషికాన్ని అడిగిందని టాక్ నడుస్తోంది. సీతారామం సినిమాతో తనకు వచ్చిన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ ముద్దుగుమ్మ భారీగా పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్.. కేవలం ఒక్క హిట్‌కే పారితోషికం భారీగా పెంచేసరికి టాలీవుడ్ మేకర్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే అందంతో పాటు అభినయం కూడా కలగలపుగా ఉన్న ఈ బ్యూటీని మాత్రం పక్కకు పెట్టాలని కూడా వారు అనుకోవడం లేదట. దీంతో టాలీవుడ్‌లో ఆమె తన స్థానం సుస్థిరం చేసుకోవడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు మృణాల్ ప్రయత్నిస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్‌లో పనిచేసేందుకు ఆమె ఎంతో నిబద్ధతతో ఉందో తెలుస్తుంది. హైదరాబాద్‌లో ఇల్లును కొనుగోలు చేయాలనే నిర్ణయం.. టాలీవుడ్‌లో సుస్థిర స్థానం సంపాదించాలనే ఆమె కోరిక తెలుస్తోంది. మృణాల్ నిర్ణయంతో ఇప్పటికే అగ్రతారలుగా కొనసాగుతున్న హీరోయిన్లకు సవాలుగా మారింది.

నాని నటిస్తున్న 30 చిత్రంలో(Nani 30) మృణాల్ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమాకు నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ సినిమా హృదయం లాంటి సూపర్ హిట్‌కు సంగీతాన్ని సమకూర్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ఐఎస్‌సీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.