Zee Telugu Ugadi Mass Dhamaka: ఈ ఉగాది నిరుటి లెక్కుండది.. నానితో జీ తెలుగు ఉగాది మాస్ ధమాకా-zee telugu ugadi mass dhamaka show with nani to telecast on sunday march 19th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee Telugu Ugadi Mass Dhamaka Show With Nani To Telecast On Sunday March 19th

Zee Telugu Ugadi Mass Dhamaka: ఈ ఉగాది నిరుటి లెక్కుండది.. నానితో జీ తెలుగు ఉగాది మాస్ ధమాకా

Hari Prasad S HT Telugu
Mar 17, 2023 11:44 AM IST

Zee Telugu Ugadi Mass Dhamaka: ఈ ఉగాది నిరుటి లెక్కుండది.. నానితో జీ తెలుగు ఉగాది మాస్ ధమాకా చూస్తే మీకూ అదే అనిపిస్తుంది. వచ్చే ఆదివారం (మార్చి 19) టెలికాస్ట్ కాబోతున్న జీ తెలుగు ఛానెల్ ఉగాది సంబరాల్లో నాని ఇరగదీశాడు.

జీ తెలుగు ఉగాది మాస్ ధమాకా అవార్డుల షోలో నాని
జీ తెలుగు ఉగాది మాస్ ధమాకా అవార్డుల షోలో నాని

Zee Telugu Ugadi Mass Dhamaka: ఈ ఉగాది తెలుగు వాళ్లకు నిజంగానే నిరుటిలెక్క ఉండదు. నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో ఓ మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అంతకంటే ముందే జీ తెలుగు (Zee Telugu Ugadi Mass Dhamaka)లో అతడు సందడి చేయబోతున్నాడు. ఈ మధ్యే ఈ స్పెషల్ షోకు సంబంధించిన ప్రోమోను ఆ ఛానెల్ రిలీజ్ చేసింది.

ఇందులో నాని అభిమానుల హడావిడి మామూలుగా లేదు. జీ తెలుగు సీరియల్స్ లో వచ్చే నటీనటులు, యాంకర్స్ అందరూ ఇందులో పాల్గొన్నారు. శ్రీముఖి ఈ షోను హోస్ట్ చేసింది. ఉగాది పచ్చడిలోని షడ్రచుల గురించి నాని చెబుతూ.. తన సినిమాల్లో తనతోపాటు నటించిన హీరోయిన్లలో ఎవరు ఏ రుచో చెప్పుకొచ్చాడు. ఇందులో సాయి పల్లవిని అతడు చేదుగా అభివర్ణించడం విశేషం.

ఉగాది రుచుల్లో చేదే ముఖ్యమైన రుచి అని, సాయి పల్లవి కూడా అలాంటి నటనతో ప్రత్యేకంగా నిలిచే నటి అని నాని అనడం విశేషం. ఇక అంటే సుందరానికిలో తనతో కలిసి నటించిన నజీమ్ ను పులుపుతో పోల్చాడు నాని. ఆమె చాలా నాటీ అని, అందుకే పులుపుతో పోల్చినట్లు చెప్పాడు.

నానితో ఉగాది మాస్ ధమాకా అంటూ జీ తెలుగు (Zee Telugu) ఈ షో చేసింది. తన దసరా మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని ఈ షోకు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ మూవీలో నాని ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. సింగరేణి ప్రాంతంలో ఉన్న వీర్లపల్లి అనే ఊరు చుట్టూ తిరిగే కథే ఈ దసరా మూవీ. ఇందులో బొగ్గు దొంగతనం చేసే వ్యక్తిగా నాని కనిపించాడు.

ఎలాంటి పాత్రనైనా తనదైన రీతిలో పోషించే నాని.. ఈ ఊర మాస్ క్యారెక్టర్ లో కూడా జీవించేశాడు. దసరా మూవీలో పక్కా తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఈ జీ తెలుగు షో ప్రోమోలోనూ చివరిగా నాని అలాంటి ఓ ఊర మాస్ డైలాగ్ చెప్పాడు.

ఈ ఉగాది నిరుటిలెక్కుండది.. ఎట్టయితే గట్లయితది సూసుకుందాం.. గుండుగుత్తగా లేపేద్దాం బాంచెత్ అంటూ నాని చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ ఉగాది మాస్ ధమాకా అవార్డుల కార్యక్రమంలో జీ తెలుగు ఛానెల్ లో ఆదివారం (మార్చి 19) సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం