తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shabaash Mithu Teaser | చరిత్ర తిరగరాయలేదు.. ఆమెనే చరిత్ర సృష్టించింది

Shabaash Mithu Teaser | చరిత్ర తిరగరాయలేదు.. ఆమెనే చరిత్ర సృష్టించింది

HT Telugu Desk HT Telugu

22 March 2022, 7:22 IST

    • Shabaash Mithu Teaser వచ్చేసింది. ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో తాప్సీ పన్ను ఆమె పాత్రలో నటిస్తోంది.
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (AFP)

భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్

సిల్వర్‌ స్క్రీన్‌పై మరో బయోపిక్‌ త్వరలోనే రాబోతోంది. రెండు దశాబ్దాలకుపైగా జెంటిల్మెన్‌ గేమ్‌ను ఏలుతున్న మిథాలీ రాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన శభాష్‌ మిథూ మూవీ టీమ్‌ టీజర్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో మిథాలీ పాత్రలో కనిపిస్తున్న తాప్సీ పన్ను ఈ టీజర్‌ను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

Baak OTT: ఓటీటీలోకి తమన్నా రాశీ ఖన్నా తమిళ హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Thalaimai Seyalagam OTT: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానున్న శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. డేట్ ఇదే

RK Roja Getup Srinu: మంత్రి రోజా కామెంట్లపై గెటప్ శ్రీను కౌంటర్.. ఎవరు అడగలేదంటూ రియాక్షన్

ఈ జెంటిల్మెన్‌ గేమ్‌లో ఆమె చరిత్రను తిరగరాయలేదు.. ఆమెనే ఓ చరిత్ర సృష్టించింది అని కామెంట్ చేస్తూ తాప్సీ ఈ టీజర్‌ రిలీజ్‌ చేయడం విశేషం. అటు మిథాలీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ టీజర్‌ను షేర్‌ చేసింది. వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్‌ సెంచరీలు చేసిన ఏకైక ఇండియన్‌ క్రికెటర్‌.. నాలుగు వరల్డ్‌కప్‌లలో కెప్టెన్‌గా ఉన్న ఘనత.. టెస్టుల్లో డబుల్‌ హండ్రెడ్‌ చేసిన యంగెస్ట్‌ అంటూ మిథాలీ రికార్డుల గురించి చెబుతూ ఈ టీజర్‌ మొదలవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మిథాలీ క్యారెక్టర్‌లోని తాప్సీ పన్ను గ్రౌండ్‌లోకి బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధమవుతున్న విజువల్స్‌ ప్లే అవుతుంటాయి.

ఈ శభాష్‌ మిథూ ప్రాజెక్ట్‌ను 2019లోనే అనౌన్స్‌ చేశారు. అప్పట్లో మిథాలీ బర్త్‌ డే సందర్భంగా ఆమెతో కేక్‌ కట్‌ చేయిస్తున్న ఫొటోలను తాప్సీ షేర్‌ చేసింది. ఈ సినిమాకు రాహుల్‌ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. అదే సమయంలో అటు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌ చక్డా ఎక్స్‌ప్రెస్‌ కూడా రెడీ అవుతోంది. ఇందులో అనుష్క శర్మ.. ఝులన్‌ పాత్రలో కనిపిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.