తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mithali Raj | క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్‌

Mithali Raj | క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్‌

Hari Prasad S HT Telugu

12 March 2022, 8:08 IST

    • ఇండియన్‌ వుమెన్‌ క్రికెట్‌ టీమ్ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ఇప్పటికే తన 6వ వరల్డ్‌కప్‌లో ఆడుతూ.. మహిళల క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును అందుకున్న మిథాలీ.. శనివారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఇలాంటిదే మరో ఘనత సాధించింది.
మిథాలీరాజ్ మరో రికార్డు
మిథాలీరాజ్ మరో రికార్డు (HT_PRINT)

మిథాలీరాజ్ మరో రికార్డు

హామిల్టన్‌: మహిళల క్రికెట్‌లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా నిలుస్తున్న ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. వరల్డ్‌కప్‌లో శనివారం వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆమె మరో రికార్డును తన పేరిట రాసుకుంది. ఇప్పటి వరకూ మహిళల క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. 

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌లో మిథాలీ ఆడుతున్న 24వ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ బెలిండా క్లార్క్‌ (23 మ్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకూ మిథాలీ 23 మ్యాచ్‌లలో 14 విజయాలను అందుకుంది. మరో 8 మ్యాచ్‌లలో టీమ్‌ ఓడిపోగా.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. 

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన మిథాలీ సేన.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్‌ టీమ్‌.. 198 రన్స్‌కే ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్‌ మాత్రమే 71 పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

టాపిక్

తదుపరి వ్యాసం