తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Manoj Wedding: పెళ్లి బంధంతో ఒక్క‌టైన మంచు మ‌నోజ్, మౌనిక‌

Manchu Manoj Wedding: పెళ్లి బంధంతో ఒక్క‌టైన మంచు మ‌నోజ్, మౌనిక‌

04 March 2023, 6:38 IST

  • Manchu Manoj Wedding: మంచు మ‌నోజ్‌, మౌనికారెడ్డిల వివాహం శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. మంచు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌నోజ్‌, మౌనిక వివాహ వేడుక‌లో పాల్గొన్నారు.

మంచు మ‌నోజ్‌, మౌనిక‌రెడ్డి
మంచు మ‌నోజ్‌, మౌనిక‌రెడ్డి

మంచు మ‌నోజ్‌, మౌనిక‌రెడ్డి

Manchu Manoj Wedding: టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ (Manch Manoj) ఓ ఇంటివాడ‌య్యాడు. భూమా మౌనికారెడ్డి మెడ‌లో మూడుముళ్లు వేశాడు. శుక్ర‌వారం రాత్రి ఫిల్మ్ న‌గ‌ర్‌లోని మోహ‌న్‌బాబు(Mohanbabu) ఇంటిలోనే వీరి వివాహ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. మ‌నోజ్‌, మౌనిక పెళ్లికి ఇరువురి కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు. మంచు మోహ‌న్‌బాబు, విష్ణుతో పాటు ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

వీరితో పాటు వైఎస్ విజ‌య‌మ్మ‌, మౌనిక‌రెడ్డి సోద‌రి అఖిల‌ప్రియ‌తో పాటు శాంత‌బ‌యోటెక్ అధినేత వ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి... మ‌నోజ్‌, మౌనిక పెళ్లి వేడుక‌లో పాల్గొన్నారు. మ‌నోజ్‌, మౌనిక పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. గ‌త ఏడాది హైద‌రాబాద్‌లో వినాయ‌క‌చ‌వితి ఉత్స‌వాల్లో మౌనిక‌రెడ్డితో క‌లిసి పాల్గొన్నాడు మ‌నోజ్‌.

అప్ప‌టినుంచే వీరి పెళ్లి వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఇరు కుటుంబ‌స‌భ్యుల అనుమ‌తితో శుక్ర‌వారం ఈ జంట పెళ్లిపీట‌లెక్కారు. కాగా మ‌నోజ్‌మ‌నోజ్‌తో పాటు మౌనిక‌కు ఇది రెండో వివాహం. 2015లో ప్ర‌ణ‌తిని ప్రేమించి పెళ్లాడాడు మ‌నోజ్‌. మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో 2019లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.