తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Dimple Kapadia Movie: ఫ్లాష్‌బ్యాక్: మ‌హేష్‌బాబు, డింపుల్ క‌పాడియా మూవీ ఎందుకు ఆగిపోయిందంటే

Mahesh Babu Dimple Kapadia Movie: ఫ్లాష్‌బ్యాక్: మ‌హేష్‌బాబు, డింపుల్ క‌పాడియా మూవీ ఎందుకు ఆగిపోయిందంటే

19 March 2023, 12:33 IST

  • Mahesh Babu Dimple Kapadia Movie: రాజ‌కుమారుడుకు ముందే హీరోగా మ‌హేష్‌బాబు ఓ సినిమా చేయాల్సింది. కానీ ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందంటే

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు

మ‌హేష్‌బాబు

Mahesh Babu Dimple Kapadia Movie: 1999లో విడుద‌లైన రాజ‌కుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మ‌హేష్‌బాబు. ఈ సినిమాకు ముందు బాల‌న‌టుడిగా గూఢ‌చారి 117, కొడుకు దిద్దిన కాపురంతో పాటు ప‌లు సినిమాల్లో న‌టించాడు. ఆ త‌ర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న మ‌హేష్‌బాబు హీరోగా అరంగేట్రం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప, కార్తీక్ కి అక్రమ సంబంధం అంట గట్టిన నరసింహ..ప్లేటు ఫిరాయించిన అనసూయ

Aavesham OTT: అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన సినిమా.. సీక్వెల్ కోసం వెయిటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అయితే రాజ‌కుమారుడు సినిమాకు ముందే మ‌హేష్‌బాబు హీరోగా ఓ సినిమా చేయాల్సింది. క‌థ, హీరోయిన్ సిద్ధ‌మైన త‌ర్వాత ఆ సినిమా ఆగిపోయింది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ వంశీ తాను రాసిన న‌ళిని ఆంటీ నీకు ఫోనోచ్చింది న‌వ‌ల‌ను సినిమాగా తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.

ఈ సినిమాలో కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ న‌టి డింపుల్ క‌పాడియాను సంప్ర‌దించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా యంగ్ హీరో ప్ర‌ధానంగా సాగే సినిమా కావ‌డంతో ఈ రోల్ కోసం మ‌హేష్‌బాబును తీసుకోవాల‌ని వంశీ అనుకున్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను కృష్ణ ముందు ఉంచారు వంశీ.

కానీ సినిమాల‌కు గ్యాప్ తీసుకున్న మ‌హేష్ చ‌దువుపై సీరియ‌స్‌గా దృష్టిపెట్ట‌డంతో అత‌డిని డిస్ట్ర‌బ్ చేయ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌తో వంశీ ప్ర‌తిపాద‌న‌ను కృష్ణ తిర‌స్క‌రించారు. అలా న‌ళిని ఆంటీ నీకు ఫోనోచ్చింది సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయిన మూడు, నాలుగేళ్ల త‌ర్వాత మ‌హేష్‌బాబు రాజ‌కుమారుడు సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.