తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lust Stories 2 Trailer: మళ్లీ రెచ్చిపోయిన తమన్నా, విజయ్ వర్మ.. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది

Lust Stories 2 Trailer: మళ్లీ రెచ్చిపోయిన తమన్నా, విజయ్ వర్మ.. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu

21 June 2023, 11:41 IST

google News
    • Lust Stories 2 Trailer: మళ్లీ రెచ్చిపోయారు తమన్నా, విజయ్ వర్మ. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ లో ఈ జంట రొమాన్స్ ను పండించారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ కు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ బుధవారం (జూన్ 21) రిలీజైంది.
లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా, విజయ్ వర్మ
లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా, విజయ్ వర్మ

లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా, విజయ్ వర్మ

Lust Stories 2 Trailer: రియల్ లైఫ్ ప్రేమ పక్షులు తమన్నా, విజయ్ వర్మ రీల్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జంట కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ బుధవారం (జూన్ 21) రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ తాజా ట్రైలర్ లో పెళ్లయిన విజయ్.. పెళ్లి కాని తమన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు చూపించారు.

తరచూ ఆమె ఇంటికి వచ్చి రొమాన్స్ చేయడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. ఇక ఈ లస్ట్ స్టోరీస్ 2 కూడా తొలి పార్ట్ లాగే మొత్తం కామం చుట్టే తిరిగింది. బాలీవుడ్ లో సీనియర్ నటులైన నీనా గుప్తా, కాజోల్ లాంటి వాళ్లు కూడా ఈ లస్ట్ స్టోరీస్ 2లో ఉన్నారు. ప్రతి మనిషిలో మౌంట్ ఫుజి అగ్ని పర్వతంలో ఉన్నంత వేడి ఉంటుందని, దానిని చల్లార్చుకోవాలంటూ నీనా గుప్తా చెప్పే ఓ డబుల్ మీనింగ్ డైలాగుతో ఈ లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ మొదలవుతుంది.

ఓ చిన్న కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేసినట్లే.. పెళ్లికి ముందు కూడా టెస్ట్ డ్రైవ్ చేయాలంటుంది బామ్మ పాత్ర పోషించిన నీనా గుప్తా. ఇలా ట్రైలర్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు, సెక్స్ చుట్టే తిరుగుతుంది. లస్ట్ స్టోరీస్ భిన్నమైన కథల ఓ ఆంథాలజీ. తొలి పార్ట్ లో కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్ లాంటి సీనియర్ డైరెక్టర్లు ఒక్కో ఎపిసోడ్ ను డైరెక్ట్ చేశారు.

అందులో కియారా అద్వానీ, భూమి పడ్నేకర్, విక్కీ కౌశల్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ లస్ట్ స్టోరీస్ 2 కూడా అందుకు భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. కాకపోతే బాలీవుడ్ లోని సీనియర్ నటీనటులతో ఇలాంటి సిరీస్ చేయడం సాహసమే. అందులోనూ కాజోల్ లాంటి నటి కూడా ఉండటం అభిమానులను ఆకర్షిస్తోంది. జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ లస్ట్ స్టోరీస్ 2 స్ట్రీమింగ్ కానుంది.

తదుపరి వ్యాసం