తెలుగు న్యూస్  /  Entertainment  /  List Of Movies And Web Series Releasing This Week On Various Ott Platforms

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే

08 December 2022, 6:28 IST

  • OTT Releases This Week: ఈ వారం స‌మంత య‌శోద‌తో పాటు తెలుగులో యంగ్ హీరోలు న‌టించిన ప‌లు సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. విభిన్న‌మైన క‌థాంశాల‌తో కూడిన వెబ్‌సిరీస్‌లు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఈ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే...

స‌మంత
స‌మంత

స‌మంత

OTT Releases This Week:

ట్రెండింగ్ వార్తలు

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?

స‌మంత (Samantha) య‌శోద (Yashoda) - డిసెంబ‌ర్ 9- అమెజాన్ ప్రైమ్‌ (Amazon prime)

స‌మంత హీరోయిన్‌గా న‌టించిన య‌శోద సినిమా డిసెంబ‌ర్ 9న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌కానుంది. స‌రోగ‌సీ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు హ‌రీ-హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నవంబ‌ర్ 11న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా 37 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

స‌రోగ‌సీ పేరుతో పెద్ద క్రైమ్‌ను న‌డిపిస్తోన్న రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి క‌లిగిన వ్య‌క్తుల‌పై య‌శోద అనే సాధార‌ణ యువ‌తి సాగించిన పోరాటం నేప‌థ్యంలో య‌శోద సినిమా రూపొందింది. ఈ సినిమాలో స‌మంత ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, ఉన్ని ముకుంద‌న్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌ల్లో క‌నిపించారు.

నితిన్(Nithiin) మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం(Macherla Niyojakavargam) -డిసెంబ‌ర్ 9 - జీ5 (ZEE5)

నితిన్ హీరోగా పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన‌ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం డిసెంబ‌ర్ 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో ఎడిట‌ర్ ఎం.ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

ఇందులో సిద్ధార్థ్ రెడ్డి అనే యంగ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా నితిన్ న‌టించాడు. మాచ‌ర్ల అనే ప్రాంతంలో ఎన్నిక‌లు లేకుండా చేసిన రాజ‌ప్ప అనే క్రిమిన‌ల్‌ను సిద్ధార్థ్ రెడ్డి ఎలా ఎదురించాడ‌నే క‌థాంశంతో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రూపొందింది. ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.

అంజ‌లి(Anjali) ఫాల్ వెబ్‌సిరీస్ (Fall webseries) - డిసెంబ‌ర్ 9 - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

ఫాల్ వెబ్‌సిరీస్‌తో డిసెంబ‌ర్ 9న ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది హీరోయిన్ అంజ‌లి. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సిరీస్ డిస్నీ ప్ల‌స్‌హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు సిద్ధార్థ్ రంగ‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో గ‌తాన్ని మ‌ర్చిపోయిన యువ‌తిగా అంజ‌లి క‌నిపించ‌బోతున్న‌ది.

లైక్ షేర్ స‌బ్‌స్క్రైబ్ (Like, Share & Subscribe) -డిసెంబ‌ర్ 9- సోనిలివ్‌ (Sonyliv)

సంతోష్‌శోభ‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా జంట‌గా న‌టించిన లైక్ షేర్ స‌బ్‌స్క్రైబ్ సినిమా సోని లివ్‌లో డిసెంబ‌ర్ 9న విడుద‌ల‌ కానుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈసినిమాకు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

రాయ్ (మ‌ల‌యాళం)- డిసెంబ‌ర్ 9 - సోని లివ్‌

విట్నెస్ - డిసెంబ‌ర్ 9 - సోని లివ్‌

కాఫీ విత్ కాద‌ల్ - డిసెంబ‌ర్ 9 - జీ5

డాక్ట‌ర్ జీ - డిసెంబ‌ర్ 11 - నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

ఆయుష్మాన్ ఖురానా, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ డాక్ట‌ర్ జీ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబ‌ర్ 11న ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. గైన‌కాల‌జిస్ట్ అయిన ఓ యువ‌కుడికి వృత్తిప‌రంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల్ని ఫ‌న్ వేలో ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా రూపొందింది.

కాంతార (హిందీ వెర్ష‌న్‌) డిసెంబ‌ర్ 9 -నెట్‌ఫ్లిక్స్‌

క్యాట్ - డిసెంబ‌ర్ 9 - నెట్‌ఫ్లిక్స్‌

ఫాడు ఏ ల‌వ్ స్టోరీ - డిసెంబ‌ర్ 9 - సోని లివ్‌

పున్నాగ రాగ (క‌న్న‌డ‌) -డిసెంబ‌ర్ 9 - జీ5

మ‌నీ హీస్ట్ కొరియ‌న్ సీజ‌న్ 2 - డిసెంబ‌ర్ 9 - నెట్‌ఫ్లిక్స్‌

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.