తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lavanya Tripathi| హీరోల పారితోషికాలపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

Lavanya Tripathi| హీరోల పారితోషికాలపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

HT Telugu Desk HT Telugu

12 May 2022, 14:23 IST

  • ఇండస్ట్రీలో దర్శకుడు, హీరోయిన్లతో పోలిస్తే కథానాయకులే అధికంగా పారితోషికం తీసుకుంటుంటారు. ఈ పారితోషికంలోని అసమానతలపై పలుమార్లు కథానాయికలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..చేస్తూనే ఉన్నారు. హీరోలకు ఎందుకు అధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తాను ఈ మధ్యే తెలుసుకున్నానని అంటూ లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి (instagram)

లావణ్య త్రిపాఠి

పదేళ్ల క్రితం అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. నవతరం తారల పోటీని తట్టుకుంటూ ఏడాదికి రెండు, మూడు సినిమాలతో టాలీవుడ్ లో రాణిస్తోంది. ప్రస్తుతం హ్యాపీబర్త్ డే అనే సినిమాతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది లావణ్య త్రిపాఠి. రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది

SIT Telugu OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎక్క‌డ‌...ఎప్పుడంటే?

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Krishna mukunda murari serial today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

ఇటీవలే లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదలచేసింది. ఇందులో చేతిల్ గన్ పట్టుకొని లావణ్య త్రిపాఠి కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో ఫన్ తో పాటు యాక్షన్ కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ లో తాను కనిపిస్తానని లావణ్య త్రిపాఠి చెప్పింది. కెరీర్ లో యాక్షన్ సినిమా చేయడం ఇదే తొలిసారి కావడంతో ట్రైనింగ్ తీసుకొని  నటించినట్లు పేర్కొన్నది. ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో చాలా సార్లు తాను గాయపడ్డట్లు లావణ్య త్రిపాటి చెప్పింది. యాక్షన్ సీక్వెన్స్ లో నటించడం ఈజీ కాదని తెలిపింది. 

ఈ సినిమాతోనే హీరోల కష్టమేమిటో..హీరోయిన్ల కంటే వారికి ఎక్కువ రెమ్యునరేషన్ ఎందుకిస్తారో అర్థమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది లావణ్య త్రిపాఠి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లయినా తాను మాత్రం న్యూకమర్ లాగే ఫీలవుతుంటానని చెప్పింది.  నంబర్ వన్ రేసు లో నిలవాలని తాను ఏ రోజు కోరుకోలేదని, పోటీని పట్టించుకోకుండా మంచి సినిమాలు చేయడంపైనే దృష్టిపెట్టాను కాబట్టే పదేళ్లయినా ఇంకా ఇండస్ట్రీలో ఉండగలిగానని చెప్పింది. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.