తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Today Episode: మురారి ప్లాన్ క‌నిపెట్టిన ముకుంద - అగ్రిమెంట్ టెన్ష‌న్‌లో కృష్ణ‌

Krishna Mukunda Murari Today Episode: మురారి ప్లాన్ క‌నిపెట్టిన ముకుంద - అగ్రిమెంట్ టెన్ష‌న్‌లో కృష్ణ‌

HT Telugu Desk HT Telugu

24 May 2023, 9:46 IST

  • Krishna Mukunda Murari Today Episode: త‌నను దూరం పెట్ట‌డానికే కృష్ణ‌కు మురారి ద‌గ్గ‌ర‌వుతోన్నాడ‌ని ముకుంద గ్ర‌హిస్తుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మురారి త‌న‌కు ఎక్క‌డ దూరం అవుతాడో అని కృష్ణ టెన్ష‌న్ ప‌డుతుంటుంది.

కృష్ణ ముకుంద మురారి
కృష్ణ ముకుంద మురారి

కృష్ణ ముకుంద మురారి

Krishna Mukunda Murari Today Episode: ముకుందను త‌న నుంచి శాశ్వ‌తంగా దూరం చేసే ప్లాన్స్ అమ‌లు చేయ‌డం మొద‌లుపెడ‌తాడు మురారి. ఆమె మాట్లాడినా ప‌ట్టించుకోన‌ట్లుగా న‌టిస్తాడు. క‌నీసం ఆమె చెప్పే మాట‌లు కూడా విన‌డు. మురారి ప్ర‌వ‌ర్త‌న‌తో ముకుంద చాలా హ‌ర్ట్ అవుతుంది. కృష్ణ‌తో అత‌డు ప్రేమ‌గా ఉండ‌టాన్ని స‌హించ‌లేక‌పోతుంది. కృష్ణ‌కు మురారి రోజురోజుకు ద‌గ్గ‌ర‌వుతుండ‌టం జీర్ణించుకోలేక‌పోతుంది. కావాల‌నే త‌న నుంచి త‌ప్పించుకోవ‌డానికి కృష్ణ‌కు ద‌గ్గ‌ర‌వుతున్నాడ‌నే మురారి ప్లాన్‌ను క‌నిపెట్టేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

అగ్రిమెంట్ గ‌డువు...

సెప్టెంబ‌ర్ 16న త‌న బ‌ర్త్‌డే అని మురారితో చెబుతుంది కృష్ణ. కానీ ఈ ఏడాది తండ్రి దూరం కావ‌డంతో బ‌ర్త్‌డే ను సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌ని అంటుంది. అంతే కాకుండా అదే రోజు మ‌న మ్యారేజ్ అగ్రిమెంట్‌కు ఆఖ‌రి రోజు అని కృష్ణ అంటుంది. ఆమె మాట‌ల‌తో మురారి ఆలోచ‌న‌ల‌తో ప‌డ‌తాడు.

ముకుంద షాకిచ్చిన మురారి...

ఆ త‌ర్వాత ముకుంద‌తో మాట్లాడాల‌ని ఆమెను పిలుస్తాడు మురారి. ప్రియుడి నుంచి చాలా రోజుల త‌ర్వాత పిలుపు రావ‌డంతో ముకుంద సంతోష‌ప‌డుతుంది. కారులో ఇద్ద‌రు క‌లిసి బ‌య‌ట‌కు వెళ‌తారు. జ‌ర్నీలో మురారి చాలా సీరియ‌స్‌గా క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత ముకుంద తండ్రి త‌న‌ను క‌లిసిన విష‌యాన్ని మురారి ఆమెతో చెబుతాడు.

అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి శ్రీనివాస్‌తో చెప్ప‌డంపై ముకుంద‌పై ఫైర్ అవుతాడు మురారి. సాటిఆడ‌పిల్ల కాపురం కూల్చి అందులో సంతోషం వెతుక్కోవ‌డం బాగాలేద‌ని అంటాడు. కృష్ణ ప్లేస్‌లోకి నిన్ను రానివ్వ‌న‌ని ముకుంద‌తో బ‌లంగా చెబుతాడు మురారి.

అత‌డి మాట‌లను ముకుంద తేలిగ్గా తీసుకుంటుంది. నా హ‌క్కును సాధించ‌డం ఎలాగో తెలుసుస‌ని మురారితో ఛాలెంజ్ చేస్తుంది. ఆమె మాట‌ల‌కు కృష్ణ వెళ్లిపోయినా భార్య స్థానం ఖాళీగానే ఉంటుంద‌ని మురారి స‌మాధానం ఇస్తాడు. ముకుంద‌కు విడాకులు ఇచ్చి మ‌రో పెళ్లి చేయ‌ల‌న్న శ్రీనివాస్ ప్ర‌తిపాద‌న గుర్తుచేస్తాడు.

అది క‌రెక్ట్ అని పెద్ద‌మ్మ భ‌వానీతో చెప్ప‌బోతున్న‌ట్లు ముకుంద‌తో అంటాడు మురారి. అత‌డి మాట‌ల‌కు షాక్ అవుతుంది ముకుంద‌. ఇంత ద‌య‌లేకుండా ఇంటి నుంచి జీవితంలో నుంచి వెళ్ల‌గొడ‌తావా అంటూ క‌న్నీళ్ల‌తో అత‌డిని వేడుకుంటుంది. అదే జ‌రిగితే తాను ప్రాణాల‌తో ఉండ‌న‌ని అంటుంది. నీ ప్రేమ‌లేని జీవితం ప్రాణం లేని శ‌రీరం ఒక్క‌టే అని అంటుంది.

ముకుంద క‌ఠిన నిర్ణ‌యం...

నిజంగానే భ‌వానీతో మురారి ఆ మాట చెప్ప‌నున్నాడా లేదా అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో తేల‌నుంది. మురారి మాట‌ల‌తో ఎమోష‌న‌ల్ అయిన ముకుంద ఎలాంటి క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మ మ్యారేజ్‌ అగ్రిమెంట్ గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో కృష్ణ టెన్ష‌న్ ప‌డుతుంటుంది.

మురారి త‌న‌ను ఎక్క‌డ వెళ్లిపొమ్మంటాడో అని భ‌య‌ప‌డుతుంటుంది. మ‌రోవైపు కృష్ణ‌ను ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డానికి ప్రేమ ఒక్క‌టే మార్గ‌మ‌ని మురారి డిసైడ్ అవుతాడు. అందుకోసం అత‌డు ఏం చేశాడ‌న్న‌ది నేటి కృష్ణ ముకుంద మురారి సీరియ‌ల్‌లో చూడాల్సిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.