తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial March 11th ఊహించని ట్విస్ట్.. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ముకుంద, కృష్ణని దోషిని చేసిన ఆదర్శ్

Krishna mukunda murari serial march 11th ఊహించని ట్విస్ట్.. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ముకుంద, కృష్ణని దోషిని చేసిన ఆదర్శ్

Gunti Soundarya HT Telugu

11 March 2024, 7:33 IST

google News
    • Krishna mukunda murari serial march 11th episode: ముకుంద ఇంట్లో అందరి ముందు బరితెగించి మాట్లాడుతుంది. దీంతో కృష్ణ తన చెంప చెల్లుమని అనిపిస్తుంది. అన్నింటికీ కృష్ణ కారణమని ఆదర్శ్ తనని నిందిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 11వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 11వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 11వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial marchi 11th episode: ఆదర్శ్ ని ఆపేందుకు మురారి ట్రై చేస్తాడు. ముకుంద ఆ గదిలో నాకోసం కాదు నీకోసం వెయిట్ చేస్తుందని నీకు తెలియదా? వెళ్ళు వెళ్ళి నా భార్యని సంతోషపెట్టు అనేసరికి మురారి కోపంగా ఆదర్శ్ చెంప పగలగొడతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తానని అంటాడు. ఇవి నా మాటలు కాదు అక్కడ తను అంటున్న మాటలు. ఈరోజు నా నోటితో అనేలా చేశావ్. నువ్వు ఇలా మాట్లాడకూడదని రేవతి అంటుంది. తప్పే పిన్ని కానీ ఇది నా మాట కాదు ముకుంద నోట ఈ మాట విని పిచ్చోడిని అయిపోయాను. నేను పిచ్చోడిని కాదు అందరూ కలిసి నన్ను పిచ్చోడిని చేశారు. అందరూ అంటే మీరు కాదు పిన్ని వీళ్ళు ఇద్దరు.

ముఖ్యంగా ఈ కృష్ణ. నన్ను పిచ్చోడిని చేసింది నువ్వే కృష్ణ. నా మీద నేను ఆశలు చంపుకుని అక్కడెక్కడో మంచు కొండలలో నేను బతుకుతుంటే నా బతుకుని మంటలపాలు చేశారు. ముకుంద మారిపోయింది నీ గురించి ఆలోచిస్తుంది నువ్వు లేకపోతే బతకదు. నీకు గుండెల్లో గుడి కట్టిందని నన్ను మోసం చేసి నువ్వు తీసుకొచ్చావ్. కానీ ఇప్పుడు ఏమైంది నా గుండెల్లో గుణపం దింపింది. అంటే ఏంటి నువ్వు అనేది ముకుంద నిన్ను గది నుంచి బయటకి పంపించేసిందా? నా మనసుని పట్టుకుని బయటకి గెంటేసింది. తన మనసులో నేను లేనంట. నాలో కూడా ఈ మురారిని చూసుకుంటుంది. చివరికి జీవితం అయినా పడకగది అయినా మురారితోనే పంచుకుంటుందట. ఇందులో ముకుంద తప్పు లేదు తప్పంతా మీ ఇద్దరిదే.

మొత్తం తేల్చేస్తానన్న కృష్ణ

మనసులో ఒకరు ఉంటే వేరొకరితో ఎలా కాపురం చేస్తుంది. ముకుంద ప్లేస్ లో ఎవరు ఉన్నా ఇలాగే చేస్తారు. ఇప్పుడు ముకుందకి మురారి కావాలి. నేను కాదు. స్టాపిడ్ ఆదర్శ్ తాగి మాట్లాడుతున్నావా? అంటే ఆవేదనతో బాధతో మాట్లాడుతుంటే తాగి మాట్లాడుతున్నట్టా? ఈ గుండె పగిలి అడుగుతున్న మాటలు కృష్ణ నీకు అర్థం కావడం లేదా? లేదు ఎంత కాదన్నా ముకుంద ఆడపిల్ల ఇలా మాట్లాడదు. నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా? నన్ను వెర్రోడిని చేయాలని చూస్తున్నావా? జీవితంలో ఎవడైన ఒక్కసారి వెర్రోడు అవుతాడు కానీ నేను రెండు సార్లు అయ్యాను. కృష్ణ అసలు ఏం జరుగుతుందని రేవతి అడుగుతుంది.

ముకుంద నీతో అలా మాట్లాడటం నిజం అంటావ్. తను ఏం మాట్లాడిందో ఇప్పుడే తేలుస్తాను. ముకుంద అలా మాట్లాడటం నిజం అయితే అది కరెక్ట్ కాదు. కారణం ఏదైనా కానీ తాళి కట్టిన భర్తని ఇలా అవమానించడం ఎంత తప్పో పరాయి మగవాడిని కోరుకోవడం అంతే తప్పు. పోనీలే అని సర్దుకుపోయే విషయం కాదు ఇప్పుడే తేలిపోవాలని కృష్ణ ముకుంద దగ్గరకి వెళ్ళి చెయ్యి పట్టుకుని కిందకి రమ్మని అంటుంది. కృష్ణ వదులు అంటే చంపేస్తాను ఎప్పుడో ఇలా అడగాల్సి ఉంది. ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నాడో విన్నావ్ కదా. ఆదర్శ్ మాట్లాడింది నిజం కాదని చెప్పు అని తనని బలవంతంగా కిందకి తీసుకొస్తుంది. నిజాలు బయట పెడితే కుటుంబ పరువు ఏమవుతుందో పెద్దత్తయ్య ఏమవుతుందోనని నోరు మూసుకుని కూర్చున్నాను కానీ ఈరోజు ఎవరి మనసులో ఏముందో ఎవరి ఉద్దేశాలు ఏంటో మొత్తం తేలిపోవాలని కృష్ణ అంటుంది.

ఆదర్శ్ అంటే ఇష్టమని నేనేమైనా చెప్పానా?

ఆదర్శ్ చెప్పింది నిజమేనా నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. వినడానికి అసహ్యం కలిగేలా మాట్లాడుతున్నాడు. అవన్నీ నువ్వు అన్నావ్ అంటున్నాడు చెప్పు ముకుంద నువ్వు అన్నావా?ఆదర్శ్ చెప్పు ముకుంద అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు అంతే కానీ ఏదేదో ఊహించుకుని నిందలు వేయకని రేవతి అంటుంది. తను మారిపోయింది ఇంతకు ముందులా కాదు. మారిపోలేదు అత్తయ్య కృష్ణ చెప్పింది నిజం. అక్కడ నేను అన్నవి, ఇక్కడ మీరు విన్నది మొత్తం నిజాలే. కానీ ఇందులో ఆదర్శ్ తప్పు ఏం లేదు, నా తప్పు కూడా లేదు అంటే కృష్ణ కోపంగా చెయ్యి ఎత్తితే ముకుంద విసిరికొడుతుంది.

తప్పు లేదు అంతే పోనీ నువ్వు చెప్పు నేను చేసిన తప్పు ఏంటి? ఆదర్శ్ అంటే ఇష్టమని నేను ఎప్పుడైనా చెప్పానా?తను లేకపోతే ఉండలేనని తనని తీసుకురండని నేను ఎప్పుడైనా చెప్పానా?మీతో ఎవరితోనైనా ఏరోజు అయినా చెప్పానా? మీ అంతట మీరే ఏవేవో అనుకుని వెళ్ళి ఆదర్శ్ ని తీసుకొచ్చారు. అంత ఇష్టం లేనప్పుడు ఆదర్శ్ కోసం వెళ్లేటప్పుడు వద్దని చెప్పొచ్చు కదాని మధు నిలదీస్తాడు. నేను ఎందుకు చెప్పాలి, అలా చెప్పే హక్కు నాకు ఏం ఉంది ఇప్పటికే నా వల్ల ఆదర్శ్ కుటుంబానికి దూరం అయ్యాడన్న బాధ నన్ను వేధిస్తుంది. ఇప్పుడు కూడా వద్దని శాశ్వతంగా తన కుటుంబానికి తనని దూరం చేయాలా? తను నాకు దూరంగా ఉన్నంత వరకు తన వల్ల నాకు ఇబ్బంది లేనంత వరకు తను ఇక్కడ ఉన్నా కశ్మీర్ లో ఉన్నా పెద్ద తేడా ఏం లేదు. అందుకే ఆదర్శ్ వస్తే కనీసం అత్తయ్య వాళ్ళు సంతోషంగా ఉంటారు నేను చెప్పాల్సింది తర్వాత చెప్పొచ్చని మౌనంగా ఉండిపోయాను.

మురారికి ముందే చెప్పాను

వచ్చాక ఎప్పటికప్పుడు చెప్దామని అనుకుంటే ఏదో ఒక ఆటంకం. అయినా మీలో ఎవరైనా ఆదర్శ్ వెనక్కి వచ్చాడన్న ఆనందం నా మొహంలో చూశారా? ఎప్పుడైనా ఇష్టంగా క్లోజ్ గా ఉండటం చూశారా?నా ఫీలింగ్స్ చెప్పుకోలేనని ఒకరు ఒంట్లో బాగోలేదని ఇంకొకరు సమాధానం చెప్పుకున్నారే కానీ నా మనసు కూడా అర్థం చేసుకోలేదు. చివరికి నేను ప్రేమించిన ఈ మురారి కూడా అర్థం చేసుకోలేదు. నువ్వు ఎన్నైనా చెప్పాల్సింది ఇక్కడి వరకు తీసుకురాకుండా ఉండాల్సిందని మధు అంటాడు. ముందే చెప్పాను ఇలాగే జరుగుతుందని మురారికే చెప్పాను. మురారి చెప్పాను కదా అంటే అవునని తల ఆడిస్తాడు అది చూసి ఆదర్శ్ కోపం రెట్టింపు అవుతుంది. ఇలాగే అంటుంది గదిలోకి వెళ్ళిన తర్వాత శోభనం జరిపిస్తే నోరు మూసుకుని ఉంటుందని అనుకున్నాడు. తర్వాత ఏ బాధ ఉండదని ముహూర్తాలు పెట్టించేశాడు.

మూహర్తాలు పెట్టేస్తే కాపురం చేసేస్తానా? నీతో మనసు పంచుకున్న దాన్ని వేరొకరితో తనువు పంచుకుంటానని ఎలా అనుకున్నావ్ మురారి. అందుకే గత్యంతరం లేక ఆదర్శ్ తో చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పకుండా శోభనం తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చెప్తే అది నా తప్పు అవుతుంది. ఈ కథకి ఇక్కడితో ముగింపు పలకాలని చెప్పేసాను.

ముకుంద చెంప చెల్లుమనిపించిన కృష్ణ

ఇప్పుడు నా గుండెల్లో ఉన్న బరువు దిగిపోయింది. నా మనసులో ఉంటుంది, ఉన్నది, ఉండబోయేది మురారీయే. ఇందులో ఏ మార్పు లేదు మురారితోనే నా జీవితం అనేసరికి కృష్ణ కోపంగా లాగిపెట్టి ఒకటి పీకుతుంది. ఛీ నువ్వు అసలు ఆడదానివేనా? తాళి కట్టిన భర్త ఎదురుగా ఉన్నాడు, కట్టిన తాళి నీ మెడలో ఉందని అంటే చాలు ఆపు కృష్ణ మనసులో ఎవరు ఉన్నారనేది ముఖ్యం.

ఏంటి అలా మాట్లాడుతున్నావని రేవతి అడుగుతుంది. నేను అందరీలాంటి ఆడపిల్లని కాను, ఈరోజు ఒకరిని ప్రేమించి మరొకరు జీవితంలోకి రాగానే మర్చిపోయి పిల్లల్ని కనేదాన్ని కాదు. కృష్ణ అది నీకు తెలుసు కదా మురారిని దక్కించుకోవడానికి ఏమైనా చేస్తానని నీకు తెలుసు కదా అంటే తెలుసని అంటుంది. నీ కళ్ళు అన్నీ నా భర్త మీద ఉన్నాయని తెలుసు అయినా నిన్ను శత్రువులా చూడకుండా ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా అని నా ప్రయత్నం నేను చేశాను అది నా తప్పా అంటే తప్పే నాకేదో మేలు చేశానని అనుకుంటున్నారు కదా కాదు బలవంతం చేశారు.

తరువాయి భాగంలో..

సిగ్గు, పరువు, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా నీకు అని కృష్ణ అంటే ముకుంద కోపంగా తన మీద చెయ్యి ఎత్తుతుంది. సిగ్గు లేని జన్మకి మళ్ళీ పౌరుషం కూడానా అంటుంది. ఆరోజు ఎందుకు ముకుందని ఎందుకు అవమానించానా అని బాధ పడే రోజు వస్తుందనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆదర్శ్ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే ఆపుతారు. ముకుంద తన తప్పు తెలుసుకుంటుందని కృష్ణ అంటే తను ఏ తప్పు చేయలేదు. ముకుంద వెళ్లిపోవడానికి నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కృష్ణ కారణమని ఆదర్శ్ నిందిస్తాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం