Guppedantha Manasu February 20th Episode: శైలేంద్ర తాట తీసిన మను - రిషి తన గుండెల్లో ఉన్నాడన్న వసు
Guppedantha Manasu February 20th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్ లో డీబీఎస్‌టీ కాలేజీకి మను డైరెక్టర్ కాకుండా అడ్డుకోవాలని శైలేంద్ర చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అతడి ప్లాన్స్ మొత్తం రివర్స్ అవుతాయి. డైరెక్టర్‌గా మను పేరు వసుధార స్వయంగా అనౌన్స్‌చేస్తుంది.
Guppedantha Manasu February 20th Episode: శైలేంద్ర ఆటలు కట్టించడానికి మను కాలేజీలోకి ఎంట్రీ ఇస్తాడు.కాలేజీ డైరెక్టర్‌గా తనను తాను ప్రకటించుకుంటాడు. తన కోసం క్యాబిన్ ఏర్పాటుచేసుకుంటాడు. మను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తే తనకు ఎండీ సీట్ ఎప్పటికీ దక్కదని శైలేంద్ర భయపడుతాడు. బోర్డ్ మీటింగ్‌లో మను మాటలకు అడుగడుగునా అడ్డు తగులుతుంటాడు. మను కాలేజీ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉండటమే మంచిదని మినిస్టర్ తన అభిప్రాయం చెబుతాడు.
మిగిలిన బోర్డ్ మెంబర్స్ కూడా మను డైరెక్టర్‌గా ఉంటే కాలేజీకి మంచి జరుగుతుందని మినిస్టర్ మాటలను సమర్థిస్తారు. యాభై కోట్లు ఇస్తే డైరెక్టర్ కావడానికి అర్హత ఉందని మీరందరూ ఎలా ఒప్పుకుంటారని బోర్డ్ మెంబర్స్‌పై శైలేంద్ర ఫైర్ అవుతాడు. ఈ రోజు డైరెక్టర్ అంటాడు. రేపు నాకు ఎండీ సీట్ కావాలని అంటాడు. అది కూడా ఇచ్చేస్తారా అంటూ మనుపై తన మనసులో ఉన్న ద్వేషాన్ని అందరి ముందు బయటపెడతాడు శైలేంద్ర...
యాభై కోట్లు ఎవరు ఇస్తారు?
అసలు ఏమిటయ్యా నీ బాధ అంటూ శైలేంద్రపై సెటైర్ వేస్తాడు మినిస్టర్. మను డైరెక్టర్ కావడం నీకు ఇష్టం లేదా అని నిలదీస్తాడు. మను కాలేజీ డైరెక్టర్ కావాల్సిన అవసరం లేదని మినిస్టర్‌కు బదులిస్తాడు శైలేంద్ర. మీకు అవసరం లేదంటే నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి కంటే కాలేజీ మరింత పతనం అయితే నా డబ్బులు తిరిగి ఎవరిస్తారు అని శైలేంద్రను అడుగుతాడు మను.
అతడి ప్రశ్నకు శైలేంద్ర షాకవుతాడు. తనకు డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్న సంగతి గుర్తొస్తుంది. కానీ ఆ విషయం బయటపెట్టలేకపోతాడు. మీరు ఇస్తారా ఆ యాభై కోట్లు అని శైలేంద్రను నిలదీస్తాడు మను. మీరు ఇస్తానంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోతానని మను అంటాడు.
ఫణీంద్ర సెటైర్స్...
వాడి దగ్గర యాభై రూపాయలు కూడా ఉండవు. ఇంకా యాభై కోట్లు ఎలా ఇస్తాడని శైలేంద్ర గాలి మొత్తం తీసేస్తాడు ఫణీంద్ర. ఈ తిక్క తిక్క ప్రశ్నలు, వెధవ డౌట్స్ ఆపమంటూ కొడుకుకు వార్నింగ్ ఇస్తాడు. డీబీఎస్‌టీ కాలేజీని ఎవరో పతనం చేయాలని చూస్తున్నారని మనుతో అంటాడు ఫణీంద్ర. రిషి ఉన్నప్పుడు శత్రువులు కనీసం గేట్ వరకు వచ్చేవారు కాదని, కానీ ఇప్పుడు ఓ సమస్య పరిష్కారం కాగానే మరో సమస్య సృష్టిస్తున్నారని, వాళ్లకు బుద్ది చెప్పడానికైనా నువ్వు డైరెక్టర్‌గా ఉండాలని మనును రిక్వెస్ట్ చేస్తాడు.
మను డైరెక్టర్‌గా ఉండటం తనకు ఇష్టమేనని మహేంద్ర కూడా తన అభిప్రాయం చెబుతాడు. మను డైరెక్టర్‌గా ఉండటానికి వసుధార ఒప్పుకోదని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మను డైరెక్టర్‌గా ఉండటం ఇష్టం లేకపోయినా ఫణీంద్ర, మహేంద్ర ఒప్పుకోవడంతో వారి మాటను కాదనలేక నాకు సమ్మతమే అని అంటుంది వసుధార. మను ఈ రోజు నుంచే డీబీఎస్‌టీ కాలేజీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటిస్తుంది వసుధార. మనుపై కోపంతో రగిలిపోతాడు శైలేంద్ర. కానీ ఏం చేయలేక సైలెంట్‌గా ఉండిపోతాడు.
శైలేంద్ర వార్నింగ్...
బోర్డ్ మీటింగ్ ముగించుకొని వెళ్లిపోతున్న మనును శైలేంద్ర ఆపుతాడు. అసలు ఎవడ్రా నువ్వు...ఎందుకు మా కాలేజీకి వచ్చావని మనుకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. కాలేజీని నా సొంతం చేసుకోవడానికి నేను ఏదో చిన్న చిన్న ప్లాన్స్ వేస్తుంటే...నువ్వు నా ప్రతి ప్లాన్‌ను ఎందుకు ఫెయిల్ చేస్తున్నావని నిలదీస్తాడు.
ఎండీ సీట్ కోసం తాను ఎన్నో నేరాలు, ఘోరాలు చేశానని మనును భయపెట్టాలని చూస్తాడు శైలేంద్ర. నేను సైలెంట్‌గా ఉంటున్నానని రెచ్చిపోయి నా దారికి అడ్డొస్తే నాలోని రాక్షసుడిని చూస్తావని మనును హెచ్చరిస్తాడు శైలేంద్ర. ఈ శైలేంద్రను ఒకవైపే చూశావు. మరోవైపు చూడాలని అనుకోకని వార్నింగ్ ఇస్తాడు.
వసుధార కావాలా?
యాభై కోట్లు ఇచ్చినట్లే ఇచ్చావు. ఆ తర్వాత చెక్ చింపేశావు. ఇప్పుడు ఏకంగా కాలేజీలో తిష్టవేశావు. అసలు నీకు ఏం కావాలి. ఎండీ సీట్ కావాలా....ఆ సీట్‌లో ఉన్న వసుధార కావాలా అని మనును నిలదీస్తాడు శైలేంద్ర. అప్పటివరకు మౌనంగా ఉన్న మను...శైలేంద్ర మాటలతో కోపం పట్టలేకపోతాడు. శైలైంద్ర చెంపపై గట్టిగా ఒకటిస్తాడు.
సాఫ్ట్‌గా ఉన్నాడు..సెలైంట్‌గా ఉన్నాడు...
నా మీద చేయిచేసుకుంటావా...నీ బ్యాడ్‌టైమ్ స్టార్టయింది. నాతో పెట్టుకున్న వాళ్లు ఎవరు భూమిమీద లేరని మనును బెదిరిస్తాడు శైలేంద్ర. నువ్వు కూసే కూతలకు తాను భయపడే రకం కాదని మను అంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేవని, నువ్వు ఎన్నెన్ని ఎత్తులు వేసిన ఎండీ సీట్ నీకు దక్కకుండా చేస్తానని శైలేంద్రకు రివర్స్ వార్నింగ్ ఇస్తాడు మను. తనను కొట్టడానికి చేయ్యేత్తిన శైలేంద్రను అడ్డుకుంటాడు మను. సాఫ్ట్‌గా ఉన్నాడు, సైలెంట్‌గా ఉన్నాడని అనుకుంటున్నావేమో...నా ఎదురునిలబడాలంటే నీ ఒంట్లో వణుకు పుడుతుందని శైలేంద్రతో అంటాడు మను.
ఇంకోసారి నా జోలికి వస్తే కాలేజీలో లేకుండా చేస్తానని శైలేంద్రకు మను వార్నింగ్ ఇస్తాడు. మను, శైలేంద్ర గొడవను అనుపమ చూస్తుంది. శైలేంద్ర వెళ్లిపోగానే మనును ఆపుతుంది. నువ్వు కాలేజీకి ఎందుకొచ్చావు, డైరెక్టర్ కావాలని ఎందుకు అనుకుంటున్నావని నిలదీస్తుంది. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లెమ్ రాదని, త్వరలోనే అన్ని నిజానిజాలు తెలుస్తాయని చెప్పి మను అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
వసుధార అసహనం...
మనును డైరెక్టర్‌గా తన నోటితోనే ప్రకటించాల్సిన రావడం వసుధారకు తట్టుకోలేకపోతుంది. మను డైరెక్టర్‌గా ఉండటం కరెక్టేనా అని మినిస్టర్ అడిగినప్పుడు నో చెబితే బాగుండేదని వసుధార అనుకుంటుంది. అప్పుడే వసుధార క్యాబిన్‌లోకి మను ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి వసుధార ఫైర్ అవుతుంది. నీకు సెన్స్ ఉందా అంటూ నోరు జారుతుంది. ఉదయం నన్ను కలుస్తానని మీరే ఫోన్ చేశారు, అందుకే మాట్లాడటానికి వచ్చానని మను అంటాడు.
ఇప్పుడు మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని అతడికి వసుధార కోపంగా సమాధానమిస్తుంది. నాకు కొన్ని సందేహాలు, అనుమానాలు ఉండేవి. వాటిని క్లారిఫై చేసుకోవడానికి మిమ్మల్ని కలవాలని అనుకున్నాను.
కానీ వాటిపై ఇప్పుడు క్లారిటీ వచ్చిందని మనుతో కోపంగా అంటుంది వసుధార. నాకు గురించి మీరు ఓ అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదని, నా గురించి ఊహలు నిజం కాకపోయిఉండొచ్చునని, విన్నవి వాస్తవాలు అయ్యుండకపోవచ్చునని మను అంటాడు.
రిషి మాటే కావచ్చు...
మీ పక్కన ఉన్న ఛైర్‌ను ఎందుకు ఎప్పుడు ఖాళీగా ఉంచుతుంటారని వసుధారను అడుగుతాడు మను. అది రిషి ఛైర్ అని, అతడి గౌరవార్థం కుర్చీని పక్కనే ఇలాగే ఉంచుకొని కాలేజీని రన్ చేస్తున్నానని వసుధార అంటుంది. కొంతమందిలా అవకాశం చూసుకొని పదవులు పొందే రకం రిషి కాదు. ఎదుటివాళ్ల బలహీనతనలు అడ్డం పెట్టుకొని ఎప్పుడు పైకి ఎదగాలని అనుకోలేదని రిషి గురించి పొగుడుతుంది వసుధార.
తన స్వశక్తితోనే కాలేజీని ఈ స్థాయికి తీసుకొచ్చాడని, రిషి నా పక్కన కాదు...ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటాడని మనుతో అంటుంది వసుధార. రిషి నా శ్వాస, ఆయనే నా మాటఅని చెబుతుంది. ఇప్పుడు నేను చేసే ప్రతి పనిని రిషి ఆశయం కోసమే చేస్తున్నానని వసుధార అంటుంది.
అంతే ఇందాకా నన్ను డైరెక్టర్ నియమించుకోవడానికి ఒప్పుకోవడం కూడా రిషి మాటే కదా అని వసుధారతో అంటాడు మను. అతడి మాటలతో వసుధార సెలైంట్ అయిపోతుంది. ఆమె దగ్గర నుంచి మను వెళ్లిపోతాడు.
శైలేంద్రకు అవమానం...
మను తనకు చేసిన అవమానం శైలేంద్ర భరించలేకపోతాడు. పదే పదే గుర్తురాకపోవడంతో బెల్టు తీసుకొని తనను కొట్టుకోవడం మొదలుపెడతాడు. ఆ సీన్ చూసి దేవయాని కంగారు పడుతుంది. కొడుకును ఆపుతుంది. ఎందుకిలా కొట్టుకుంటున్నావని అడుగుతుంది.
ఒంట్లో రోష కణాలు, పౌరుష కణాలు చచ్చిపోయినట్లు ఉన్నాయి...ఇలా కొట్టుకుంటేనయినా కాస్తంత రోషం వస్తుందని శైలేంద్ర అంటాడు. తనను కొట్టమని తల్లిని అడుగుతాడు శైలేంద్ర. కానీ దేవయాని అందుకు ఒప్పుకోదు. కానీ శైలేంద్ర బలవంతపెట్టడంతో కాదనలేక బెల్టు తీసుకొని శైలేంద్రను కొడుతుంది. భర్తను దేవయాని కొట్టడం చూసి ధరణి ఆపుతుంది. తన భర్తను ఎందుకిలా కొడుతున్నారని దేవయాని చేతులోని బెల్ట్ తీసుకొని ఆమెను కొట్టబోతుంది. శైలేంద్రనే నన్ను ఇలా కొట్టమని అంటున్నాడని కోడలితో అంటుంది దేవయాని.
ముందు వెనుక చూసుకోకుండా నాపై బెల్ట్ ఎందుకు ఎత్తావని ధరణిని నిలదీస్తుంది దేవయాని. భర్తను కొడుతుంటే అడ్డుకోకపోతే ఆయన మీద నాకు ప్రేమ లేదని అందరూ అనుకుంటారని అత్తతో పాటు భర్తపై సెటైర్ వేస్తుంది ధరణి. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.