తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yash In Raavan Role : గ్యాంగ్‌స్టర్ టూ రావణ్‌.. లంకేశ్వరుడి పాత్రలో రాకీ భాయ్

Yash In Raavan Role : గ్యాంగ్‌స్టర్ టూ రావణ్‌.. లంకేశ్వరుడి పాత్రలో రాకీ భాయ్

Anand Sai HT Telugu

30 January 2023, 14:03 IST

    • Yash In Ramayana : కేజీఎఫ్ 2 సూపర్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో యశ్ తర్వాత సినిమాపై సహజంగానే అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే రావణసురుడి పాత్రలో యశ్ కనిపించనున్నట్టుగా టాక్ నడుస్తోంది.
యశ్
యశ్ (Twitter)

యశ్

కేజీఎఫ్ 2(KGF 2)తో కన్నడ నటుడు యశ్ పాన్ ఇండియా(Pan India) స్టార్ అయిపోయాడు. ఎక్కడకు వెళ్లినా.. రాకీ భాయ్(Rocky Bhai) అంటూ ఫ్యాన్స్ పిలుస్తుంటారు. కేజీఎఫ్ తర్వాత.. యశ్(Yash Movies) నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటనేది మాత్రం.. ప్రకటించలేదు. కానీ ఇప్పుడో ఇంట్రస్టింగ్ వార్త ఫిలీం సర్కిల్స్ లో వినిపిస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ రావణసురుడి పాత్రలో కనిపించనున్నాడు. నితేశ్ తివారి దర్శకత్వంలో రానున్న రామయణంలో యశ్ లంకేశ్వరుడి పాత్ర పోషించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

నితేశ్ తివారి(Nitesh Tiwari) తీయనున్న రామయణంలో రాముడిగా రణ్ బీర్ కపూర్(ranbir kapoor) కనిపించనున్నాడు. అయితే మెుదట హృతిక్ రోషన్(hrithik roshan) రావణసురుడిగా నటిస్తాడని అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు నుంచి హృతిక్ తప్పుకున్నాడు. దీంతో యశ్ వైపు మెుగ్గు చూపినట్టుగా తెలుస్తోంది.

హృతిక్ రోషన్ నేరుగానే.. రావణసురుడి పాత్రను చేయలేనని నితేశ్ తివారితో చెప్పాడట. ఎందుకు చేయట్లేదని వివరణ కూడా ఇచ్చాడని టాక్. దీంతో హృతిక్ ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టైంది. మధు మంతెన, అల్లు అరవిద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే హృతిక్ తప్పుకొన్నాక.. ఆ టీమ్ చూపు.. కేజీఎఫ్ స్టార్ యశ్ మీదకు వెళ్లింది. అందుకే యశ్ ను రావణసురుడి పాత్రకు అడిగారట. నితేష్ ఇచ్చిన బ్రీఫ్.. రాకీ భాయ్ కి నచ్చిందట.. కానీ అధికారిక ప్రకటన మాత్రం చేయాల్సి ఉంది. ఒకవేళ యశ్ ఒకే చెబితే... ఈ భారీ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ పెరగనుంది.

గత ఏడాది కేజీఎఫ్ 2 విడుదలై బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. కన్నడ సినిమా వైపు అందరూ తిరిగి చూసేలా చేసింది. ఇక రావణుడి పాత్రలో యశ్ నటిస్తే.. రాకీ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ నుంచి రావణ్‌గా మారనున్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ భారీ చిత్రంలో యశ్ ని రావణ్‌గా చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్(KGF) తర్వాత.. యశ్ 4, 5 సినిమాలకు సైన్ చేశారని చెబుతున్నారు. వీటిలో ఒకటి నితేష్ తివారి రామాయణం అని కూడా అంటున్నారు. మరో రెండు నెలల్లో యశ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.