తెలుగు న్యూస్  /  Entertainment  /  Kgf 2 Trp Rating Yash Movie Gets Shocking Trp Rating

KGF 2 Trp Rating: థియేటర్లలో హిట్ బుల్లితెరపై ఫట్ - కేజీఎఫ్ 2కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్

02 September 2022, 14:13 IST

  • KGF 2 Trp Rating: యశ్ (Yash)హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 చిత్రం ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. ఇటీవల టీవీలో ఈ సినిమా తొలిసారి టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన టీఆర్‌పీ రేటింగ్ ఎంతంటే...

యశ్
యశ్

యశ్

KGF 2 Trp Rating: ఈ ఏడాది యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. కన్నడ, బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు ప్రతి భాషలో హయ్యెస్ట్ గ్రాసర్ గా కేజీఎఫ్ 2 నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కేజీఎఫ్ 2 నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

యశ్ హీరోయిజం, ఎలివేషన్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టేకింగ్ కు అన్ని ఇండస్ట్రీల వారు ఫిదా అయిపోయారు. థియేటర్లలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇటీవల జీ తెలుగులో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. ఇదే తొలి టీవీ ప్రీమియర్ కావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ చేసింది. కానీ ఈ సినిమాకు కేవలం 9.15 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. కేజీఎఫ్ పార్ట్ వన్ 11.9 టీఆర్‌పీ రేటింగ్ ను సొంతం చేసుకున్నది. పార్ట్ వన్ కంటే తక్కువగా పార్ట్ 2కు టీఆర్‌పీ రేటింగ్స్ రావడం చర్చనీయాంశంగా మారింది.

డబ్బింగ్ సినిమాల్లో రోబో 19.4, బిచ్చగాడు 18.75, కబాలి 14.52 టీఆర్‌పీ రేటింగ్ సాధించాయి. రొబో, బిచ్చగాడులో సగమే సగం కూడా టీఆర్‌పీ రేటింగ్ కేజీఎఫ్ 2కు రాకపోవడం షాక్ కు గురిచేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.