తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthi Pasalapoodi Veera Babu Ott Release Date: ఓటీటీలో రిలీజైన కార్తి ప‌స‌ల‌పూడి వీర‌బాబు సినిమా

Karthi Pasalapoodi Veera Babu OTT Release Date: ఓటీటీలో రిలీజైన కార్తి ప‌స‌ల‌పూడి వీర‌బాబు సినిమా

30 September 2022, 16:45 IST

  • Karthi Pasalapoodi Veera Babu OTT Release Date: కార్తి హీరోగా న‌టించిన ప‌స‌ల‌పూడి వీర‌బాబు సినిమాలో డైరెక్ట్ గా ఓటీటీలో విడుద‌లైంది. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంటే...

కార్తి
కార్తి (twitter)

కార్తి

Karthi Pasalapoodi Veera Babu OTT Release Date: త‌మిళ హీరో కార్తి సినిమాల‌కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అత‌డు న‌టించిన ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులో అనువాద‌మై పెద్ద విజ‌యాల్ని సాధించాయి.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఆకట్టుకుందా?

అవారా, ఖాకీ, ఖైదీ తెలుగులో స్ట్రెయిట్ హీరోల సినిమాల‌కు ధీటుగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. కార్తి త‌మిళ సినిమాల‌ను తెలుగులో రిలీజ్ చేయ‌డం అన‌వాయితీగా వ‌స్తోంది. కార్తి గ‌త చిత్రం విరుమ‌న్ కూడా తెలుగులో రిలీజైంది.

థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే ప‌స‌ల‌పూడి వీర‌బాబు పేరుతో ఈ సినిమాను విడుద‌ల‌చేశారు. శుక్ర‌వారం (నేడు) నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ముత్త‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 12న థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌లైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

విరుమ‌న్ సినిమాతో అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అహంభావ మ‌న‌స్త‌త్వ‌మున్న తండ్రి, మంచి మ‌న‌సున్న కొడుకుకు మ‌ధ్య సాగే క‌థ‌తో ముత్త‌య్య ఈ సినిమాను రూపొందించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.