తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut: కంగనాకు భారీ షాక్‌.. ఆ సినిమాతో రూ.78 కోట్ల నష్టం

Kangana Ranaut: కంగనాకు భారీ షాక్‌.. ఆ సినిమాతో రూ.78 కోట్ల నష్టం

HT Telugu Desk HT Telugu

15 June 2022, 16:19 IST

    • బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు పెద్ద షాకే తగిలింది. తన రీసెంట్ మూవీ ధాకడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా బోల్తా పడటంతో భారీ నష్టాలను చవిచూసింది.
కంగనా రనౌత్
కంగనా రనౌత్ (Pallav Paliwal)

కంగనా రనౌత్

బాలీవుడ్‌లో హీరోలకు సమానమైన క్రేజ్‌ కంగనా రనౌత్‌ సొంతం. ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఆమె.. ఈ మధ్య హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ ఎంచుకుంటోంది. తన పక్కన హీరోలుగా నటించడానికి కూడా చాలా మంది భయపడుతున్నారని ఆ మధ్య ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పడం విశేషం. అయితే ఆమె లేటెస్ట్ మూవీ ధాకడ్‌ కంగనాకు పెద్ద షాకే ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Releases: ఓటీటీలోకి ఒక్కరోజే 8 సినిమాలు- 3 మాత్రమే స్పెషల్- రెండు బోల్డ్, మరొకటి క్రైమ్ థ్రిల్లర్- ఎక్కడ చూస్తారంటే?

Patang: ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి హీరోయిన్‌గా పతంగ్- కామెడీ స్పోర్ట్స్ డ్రామా- డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్స్

The 100 Movie: థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డానికి ముందే మొగ‌లి రేకులు సాగ‌ర్ మూవీకి అవార్డ్‌

Barbie Telugu OTT: ఎనిమిది ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీని తెలుగులో చూడొచ్చు - ఏ ఓటీటీలో అంటే?

ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ఆమె ఏజెంట్‌ అగ్ని పాత్రలో కనిపించింది. రూ.85 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కేవలం రూ.2.58 కోట్ల కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. దీంతో ఈ మూవీ ప్రొడ్యూసర్లకు రూ.78 కోట్ల నష్టం వాటిల్లినట్లు బాలీవుడ్ హంగామా వెల్లడించింది. ఇప్పటి వరకూ ఈ సినిమా డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులను కూడా వాళ్లు అమ్మలేదు.

ఇప్పుడు బాక్సాఫీస్‌ దగ్గర మూవీ దారుణంగా బోల్తా పడటంతో ఈ డిజిటల్‌, టీవీ హక్కులను మరీ తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహా అయితే ఈ రెండూ కలిపి రూ.5 కోట్ల వరకూ రావచ్చని అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్‌ కలెక్షన్లు, ఈ హక్కులు కలుపుకున్నా.. నిర్మాతలకు రూ.78 కోట్ల నష్టం తప్పదు. ధాకడ్‌ మూవీకి కాస్త పాజిటివ్‌ రివ్యూలే వచ్చినా.. ఆ సినిమాకు కార్తీక్‌ ఆర్యన్‌ భూల్‌ భులయ్యా 2 నుంచి గట్టి పోటీ ఎదురైంది.

ఈ మూవీ ఫెయిల్యూర్‌పై కంగనా స్పందించింది. 2022 ఇంకా ముగియలేదని, లాకప్‌ రియాల్టీ షో రూపంలో తనకు పెద్ద సక్సెస్‌ దక్కినట్లు ఆమె చెప్పింది. 2019లో మణికర్ణిక మూవీకి రూ.160 కోట్లు వచ్చాయని, అది పెద్ద సక్సెసని చెప్పినా ఆమె.. గతేడాది తలైవీతో తన కెరీర్‌లోనే పెద్ద హిట్‌ అందుకున్నట్లు తెలిపింది. ఇక ఆమె ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.