తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kangana Ranaut | యువకుడిని ముద్దులతో ముంచెత్తిన కంగనా.. వీడియో వైరల్

Kangana Ranaut | యువకుడిని ముద్దులతో ముంచెత్తిన కంగనా.. వీడియో వైరల్

18 May 2022, 12:09 IST

    • ఇటీవల బాలీవుడ్ క్వీన్ కంగనా తను హోస్ట్ చేసిన రియాల్టీ షో లాకప్ సక్సెస్ పార్టీలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆ షోలోని కంటెస్టెంట్స్‌లో ఒకరైన శివమ్ శర్మను ముద్దులతో ముంచెత్తింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కంగనా రనౌత్
కంగనా రనౌత్ (Twitter)

కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పాలన్నా నిర్మోహమాటంగా, ధైర్యంగా తన అభిప్రాయాన్ని బయటకు వ్యక్త పరుస్తుంటుంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో నెపోటిజంపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది.మూడు సార్లు జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో ధాకడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా ఓ పక్క వరుస పెట్టి సినిమాలు చేస్తూనే.. మరోపక్క రియాల్టీ షోకు వ్యాఖ్యతగానూ చేస్తోంది. లాకప్ అనే రియాల్టీ షోను ఈ ముద్దుగుమ్మ హోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది ఈ బ్యూటీ. లాకప్ షోలో పాల్గొన్న దిల్లీకి చెందిన శివమ్ శర్మను ముద్దులతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Karthika Deepam Chandu: కార్తీక దీపం చందు ఆత్మ‌హ‌త్య - ప‌విత్ర జ‌యరాం చ‌నిపోయిన ఐదు రోజుల‌కే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

లాకప్ షో సక్సెస్ అయినందుకు గానూ పార్టీ జరిగింది. ఈ వేడుకలో శివమ్ శర్మపై కంగనా రనౌత్ ముద్దుల వర్షాన్ని కురిపించింది. వీడియోను గమనిస్తే.. శివమ్ శర్మ నడుచుకుంటూ కంగనా వద్దకు వస్తాడు. వెంటనే కంగనా.. అతడిని పట్టుకుని బుగ్గపై ముద్దు పెట్టుకుంది. ఒకటితో ఆపకుండా వరుసగా ముద్దులు పెట్టుకుంటూ శివమ్ శర్మను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకుముందునుంచే సెల్ఫీ వీడియో తీస్తున్న శివమ్.. ఆ ఘటనను కూడా కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం కంగనా నటించిన ధాకడ్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఈ బాలీవుడ్ బ్యూటీ గుఢచారి పాత్రలో కనిపించనుంది. ఈ క్యారెక్టర్‌ పేరు ఏజెంట్‌ అగ్ని. ఇందులో అర్జున్‌ రాంపాల్‌ కూడా నటిస్తున్నాడు. తనతో నటించే నటులు బాలీవుడ్‌లో నిషేధం ఎదుర్కొంటారని, తన సినిమాలకు నటులతో సమస్య ఏర్పడిందని కూడా ఈ మధ్య కంగనా చెప్పింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం