తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Kiara Advani: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Sanjiv Kumar HT Telugu

18 May 2024, 10:30 IST

google News
  • Kiara Advani In Cannes Film Festival 2024: కేన్స్ 2024లో గేమ్ చేంజర్ హీరోయిన్ కియారా అద్వానీ డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. వానిటీ ఫెయిర్ నిర్వహిస్తున్న సినిమా గాలా డిన్నర్ రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే! (Instagram/@kiaraaliaadvani)

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గేమ్ చేంజర్ హీరోయిన్ డెబ్యూ ఎంట్రీ.. కియారా డ్రెస్ ప్రత్యేకతలు ఇవే!

Kiara Advani Cannes 2024: రామ్ చరణ్ (Ram Charan) స్పెషల్ మూవీ గేమ్ చేంజర్ (Game Changer Movie) హీరోయిన్ కియారా అద్వానీ తన తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2024లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ కియారా అద్వానీ డెబ్యూ ఎంట్రీగా నిలిచింది. ఈ విషయంతో కియరా అద్వానీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

లోరియల్ ప్యారిస్ బ్రాండ్ అంబాసిడర్‌

లోరియల్ ప్యారిస్ బ్రాండ్ అంబాసిడర్‌లలో ఒకరైన కియారా అద్వానీ కేన్స్‌లో వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేన్స్‌లో గడిపిన గ్లింప్స్‌తో కూడిన రీల్‌ను షేర్ చేసింది.

డ్రెస్ డిజైనర్

ఈ రీల్‌లో, కియారా అద్వానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన హై-స్లిట్ గౌనులో గాలా వద్దకు వచ్చింది. కబీర్ సింగ్ బ్యూటి కియారా అద్వానీ సొగసైన గౌను వేసుకుని పెద్ద పెర్ల్ చెవిపోగులతో మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ రీల్‌ను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీనికి "రెండెజౌస్ ఎట్ ది రివేరా" అని క్యాప్షన్ రాసుకొచ్చింది కియారా అద్వానీ.

వేలల్లో కామెంట్స్-లైక్స్

కియరా అద్వానీ రీల్‌ను షేర్ చేసిన వెంటనే అతి కొద్ది క్షణంలోనే వైరల్‌గా మారింది. ఒక గంటలో, పోస్ట్‌కి 450K లైక్‌లతోపాటు 2500K కామెంట్‌లు వచ్చాయి. కియారా అభిమానులు ఆమె ఎంట్రీ కేన్స్‌కే 'సాలిడ్ ఎంట్రీ' అని ప్రశంసించారు. ఒక అభిమాని "ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ" అని రాశాడు. మరో అభిమాని "ఓహ్హ్ వాట్ ఎ బ్యూటీ" అని రాశాడు. అభిమానుల్లో ఒకరు "అద్భుతమైన కియారా" అని రాశారు. "కియారా అద్వానీకి దక్కిన గౌరవం" అంటూ ఓ నెటిజన్ రాశారు.

ఆ సినిమాతో ప్రారంభం

కాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం (మే 14) రాత్రి ప్రారంభమైంది. క్వెంటిన్ డ్యూపియక్స్ రూపొందించిన 'లే డ్యూక్సీమ్ యాక్టే (ది సెకండ్ యాక్ట్)' సినిమా వరల్డ్ ప్రీమియర్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివర్ ప్రారంభమైంది. ఈ సినిమాలో లీ సెడౌక్స్, విన్సెంట్ లిండన్, లూయిస్ గారెల్ అండ్ రాఫెల్ క్వెనార్డ్ నటించారు.

థ్రిల్లింగ్‌గా

కేన్స్ 2024 (Cannes 2024) ప్రారంభ వేడుకలో ఆస్కార్ విజేత మెరిల్ స్ట్రీప్ గౌరవ పామ్ డి ఓర్‌ను అందుకున్నారు. "ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం నాకు ఎనలేని గౌరవంగా భావిస్తున్నాను. అంతర్జాతీయ కళాకారుల సంఘం కోసం, కేన్స్‌లో బహుమతిని గెలుచుకోవడం, చిత్రనిర్మాణ కళలో అత్యున్నత విజయాన్ని ఎల్లప్పుడూ తెలుపుతుంది. ఇంతకుముందు ఇలాంటి అవార్డ్స్ అందుకున్న వారితో సమానంగా నేను గౌరవం అందుకోవడం థ్రిల్లింగ్‌గా ఉంది" అని మెరిల్ స్ట్రీప్ తెలిపారు.

టాలీవుడ్ ఎంట్రీ

ఇదిలా ఉంటే, గేమ్ చేంజర్ బ్యూటి కియారా అద్వానీకి ఇదే తొలి కేన్స్ డెబ్యూ ఎంట్రీ. ఆమె త్వరలో గేమ్ చేంజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. మహేష్ బాబు భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కియారా. ఆ తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ మూవీలో నటించింది. అనంతరం తెలుగులో బ్రేక్ ఇచ్చి మళ్లీ బాలీవుడ్ బాట పట్టి చాలా వరకు హిట్ సినిమాల్లో చేసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం