(1 / 9)
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెగాలోపోలిస్ సినిమా ప్రీమియర్ షోకు ఫోటోగ్రాఫర్లకు ఐశ్వర్యరాయ్ పోజులిచ్చారు. ఈ కార్యక్రమానికి రెడ్ కార్పెట్ లో బ్లాక్ అండ్ గోల్డ్ గౌన్ ధరించి, బంగారు అలంకరణ వస్తువులతో అలంకరించారు. ఫాల్గుణి, షేన్ డిజైన్ చేసిన వస్త్రధారణలో ఐశ్వర్య దర్శనం ఇచ్చింది.
(AFP)(2 / 9)
భారీ స్లీవ్స్‌తో, ముందు భాగంలో ఆకర్షణీయమైన బంగారు నమూనాతో, ఐశ్వర్యారాయ్ గౌను ఎంతో గ్రాండ్‌గా ఉంది. ఆ గౌను మెరుస్తూ మరింత అట్రాక్ట్ చేసింది.
(AP)(3 / 9)
రెట్రో తరహా హెయిర్ స్టైల్ తో తన అందాలను ఆరబోసిన ఐశ్వర్యరాయ్ తన జుట్టును కిందకు జారవిడిచింది. బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తూ ఆకట్టుకుంది.
(AFP)(4 / 9)
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండో రోజున రెడ్ కార్పెట్ పై ఎంతో వయ్యారంగా నడుస్తూ ఐశ్వర్య రాయ్ పోజులు ఇచ్చింది.
(AFP)(5 / 9)
రెడ్ కార్పెట్ పై కనిపించడానికి ముందు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో కలిసి నడుస్తున్నట్లు పలు వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
(AFP)(6 / 9)
(7 / 9)
లోరియల్ ప్యారిస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఐశ్వర్యరాయ్ కేన్స్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె చేతికి ఉన్న కట్టు, ఆమెకు అయిన గాయం ఏంటీ అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
(AFP)(8 / 9)
కాగా ఐశ్వర్యారాయ్ 2002లో షారుఖ్ ఖాన్, సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ సినిమా ప్రీమియర్ షోతో మొదటిసారి కేన్స్ లో అడుగుపెట్టింది.
(AFP)(9 / 9)
కేన్స్ జ్యూరీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా ఐశ్వర్యారాయ్ రికార్డు సృష్టించింది. 2003 లో, కేన్స్ జ్యూరీ సభ్యురాలిగా, ఐశ్వర్య ఆకుపచ్చ చీర నుంచి భారీగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ నుంచి పసుపు సూట్ వరకు వివిధ రకాల స్టైలింగ్ భారతీయ దుస్తులలో కనిపించింది.
(REUTERS)ఇతర గ్యాలరీలు