Kamal Haasan Upcoming Movies: ఆరు సినిమాల్ని లైనప్‌లో పెట్టిన కమల్ - జోరు మామూలుగా లేదుగా
07 November 2022, 17:11 IST
Kamal Haasan Birthday: విలక్షణ నటుడు కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం 35 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేయబోతున్నారు. కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. మణిరత్నం సినిమా, ఇండియన్ -2తో పాటు మరో నాలుగు సినిమాల్ని కమల్‌హాసన్ లైనప్‌లో పెట్టినట్లు సమాచారం.
కమల్‌హాసన్
Kamal Haasan Upcoming Movies: విక్రమ్ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సీనియర్ హీరో కమల్‌హాసన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 450 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
ఈ సక్సెస్ తర్వాత తిరిగి సినిమాల స్పీడు పెంచాడు కమల్‌హాసన్. ప్రస్తుతం ఆరు సినిమాల్ని లైనప్‌లో పెట్టినట్లు సమాచారం. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో ఓ సినిమా చేయబోతున్నట్లు కమల్‌హాసన్ ప్రకటించాడు.వీరిద్దరి కలయికలో 1987లో నాయకుడు సినిమా రూపొందింది. దాదాపు 35 ఏళ్ల విరామం తర్వాత మరోసారి కమల్‌హాసన్, మణిరత్నం సినిమాలు చేయబోతుండటం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2024లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఇండియన్ -2 సినిమా షూటింగ్‌తో కమల్‌హాసన్ బిజీగా ఉన్నాడు. అనివార్య కారణాల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే తిరిగి మొదలుపెట్టారు.
సోమవారం కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ 2 కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోన్నారు. ఇండియన్ -2, మణిరత్నం సినిమాతో పాటు మరో నాలుగు సినిమాల్ని కమల్‌హాసన్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వలిమై దర్శకుడు హెచ్ వినోద్‌తో కమల్‌హాసన్ ఓ సినిమా చేయనున్నాడు. అలాగే దర్శకులు మహేష్ నారాయణణ్, పా రంజిత్‌తో సినిమాలకు కమల్‌హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు విక్రమ్ -2 కూడా రానుంది. విక్రమ్ సినిమాకు సీక్వెల్‌ను ఇప్పటికే అనౌన్స్‌చేశారు. క్లైమాక్స్‌లో సూర్య క్యారెక్టర్‌తో సీక్వెల్‌పై అంచనాల్ని పెంచారు. ఈ లైనప్ చూస్తుంటే మరో నాలుగైదేళ్ల వరకు కమల్ డేట్స్ అడ్జెస్ట్ కావడం కష్టంగానే కనిపిస్తోంది.