తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Letter To Rishab : కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టికి కమల్ హాసన్ సలహా

Kamal Letter To Rishab : కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టికి కమల్ హాసన్ సలహా

Anand Sai HT Telugu

14 January 2023, 6:29 IST

    • Kamal Haasan Letter : కాంతార సినిమా చూసి రిషబ్ శెట్టికి కమల్ హాసన్ సుదీర్ఘ లేఖ రాశాడు. ఓ లెజెండరీ యాక్టర్ నుంచి ఈ తరహా ప్రశంసా పత్రం రావడం పట్ల రిషబ్ సంతోషం వ్యక్తం చేశాడు.
రిషబ్ శెట్టికి కమల్ హాసన్ లేఖ
రిషబ్ శెట్టికి కమల్ హాసన్ లేఖ

రిషబ్ శెట్టికి కమల్ హాసన్ లేఖ

కన్నడ చిత్ర పరిశ్రమతో నటుడు కమల్‌హాసన్‌(Kamal Haasan)కు మంచి అనుబంధం ఉంది. కన్నడ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో ఆయనకు ఫ్రెండ్ షిప్ ఉంది. కొన్ని కన్నడ సినిమాల్లో నటిస్తే.. ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇప్పుడు కమల్ హాసన్ 'కాంతార'(Kantara) సినిమా గురించి ప్రశంసించారు. ఈ సినిమా తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి తన ప్రశంసలు తెలుపుతూ రిషబ్ శెట్టికి సుదీర్ఘ లేఖ రాశాడు. ఈ లేఖలో 'కాంతార' గురించి తనకు అనిపించిన విషయాలను పంచుకున్నాడు కమల్. రిషబ్ శెట్టికి ఒక సలహా కూడా ఇచ్చాడు .

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

కమల్ హాసన్ నుంచి ఈ తరహా ప్రశంసా పత్రం రావడం పట్ల రిషబ్ శెట్టి(Rishab Shetty) చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ లేఖ ఫొటోను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేశాడు. 'ఈ లేఖ భారతీయ సినిమా దిగ్గజ నటుడి నుండి వచ్చింది. కమల్ సార్ ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంది.' అంటూ రిషబ్ శెట్టి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

గతంలో కమల్ హాసన్ ‘కాంతార’ సినిమా(Kantara Cinema) చూశాడు. అప్పుడు కూడా రిషబ్ శెట్టిని ఫోన్‌లో ప్రశంసించాడు. 'ఇప్పటికే ఫోన్‌లో చెప్పినట్లు మీ తర్వాతి సినిమాతో కాంతార రికార్డును బద్దలు కొట్టండి' అంటూ కమల్ హాసన్ లేఖను పూర్తి చేశాడు. ఈ మేరకు సలహా ఇచ్చాడు.

రిషబ్ శెట్టి తదుపరి సినిమా ఇంకా వెల్లడి కాలేదు. కాంతార విడుదలకు ముందే కొన్ని సినిమాలను అంగీకరించాడు. వాటినే కంటిన్యూ చేస్తాడా లేక మరో ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంతార 2(Kantara 2) రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పోటీల్లో పాల్గొనేందుకు కూడా కాంతార చిత్రం అర్హత సాధించింది. ఈ వార్తను హోంబాలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ చిత్రం ఫైనల్ నామినేషన్‌లో చేరి ఆస్కార్‌ను గెలుచుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.