తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan Abhay Movie Re Release In Theatres Soon

Kamal Haasan Abhay Re Release: రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన క‌మ‌ల్‌హాస‌న్ ఫ్లాప్ మూవీ

26 January 2023, 8:42 IST

  • Kamal Haasan Abhay Re Release: క‌మ‌ల్‌హాస‌న్ అభ‌య్ సినిమా మ‌ళ్లీ థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్న‌ది. 1000 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు నిర్మాత క‌లైపులి థాను ప్ర‌క‌టించాడు.

క‌మ‌ల్‌హాస‌న్
క‌మ‌ల్‌హాస‌న్

క‌మ‌ల్‌హాస‌న్

Kamal Haasan Abhay Re Release: టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ పాపుల‌ర్‌గా అయ్యింది. ఖుషి, జ‌ల్సా, పోకిరితో పాటు ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు థియేట‌ర్ల‌లో రీ రిలీజై భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. తాజాగా ఈ రీ రిలీజ్‌ ట్రెండ్‌ను కోలీవుడ్ ఫాలో అయ్యేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

గ‌తంలో విజ‌య‌వంత‌మైన త‌మిళ సినిమాల‌ను మ‌రోమారు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు త‌మిళ నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ అళ‌వ‌ద‌న్ (తెలుగులో అభ‌య్) సినిమాను త్వ‌ర‌లోనే రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు త‌మిళ అగ్ర నిర్మాత క‌లైపులి థాను ప్ర‌క‌టించారు.

అళ‌వ‌ద‌న్ సినిమా విడుద‌లై 22 ఏళ్ల‌యిన సంద‌ర్భంగా మ‌రోమారు థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాదాపు 1000 స్క్రీన్స్‌లో 4కే టెక్నాల‌జీలో అభ‌య్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్న‌ట్లు క‌లైపులి థాను వెల్ల‌డించారు.

సైకో థ్రిల్ల‌ర్ క‌థాంశంతో 2001లో రిలీజైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఫ్లాప్ సినిమాను రీ రిలీజ్ చేయ‌డం కోలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో కిల్ల‌ర్‌గా, ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌మ‌ల్‌హాస‌న్ డ్యూయ‌ల్ రోల్ చేశాడు. క‌మ‌ల్ యాక్టింగ్‌కు పేరొచ్చినా లిమిటెడ్ ఆడియెన్స్‌ను మాత్ర‌మే అభ‌య్ సినిమా మెప్పించింది.

అభ‌య్‌లో ర‌వీనా టాండ‌న్‌, మ‌నీషా కొయిరాలా హీరోయిన్లుగా న‌టించారు. సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇర‌వై రెండేళ్ల క్రిత‌మే అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో రూపొందిన ఈ సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేష‌న‌ల్ అవార్డ్‌ను సొంతం చేసుకున్న‌ది. అభ‌య్ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లేను క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా అందించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.