తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ka Movie Collection: 'క' మూవీకి స్వల్పంగా పెరిగిన కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

KA Movie Collection: 'క' మూవీకి స్వల్పంగా పెరిగిన కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sanjiv Kumar HT Telugu

02 November 2024, 16:55 IST

google News
  • KA Movie 2 Days Worldwide Box Office Collection: కిరణ్ అబ్బవరం న్యూ మూవీ క బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అక్టోబర్ 31న విడుదలైన క మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో క మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

'క' మూవీకి స్వల్పంగా పెరిగిన కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
'క' మూవీకి స్వల్పంగా పెరిగిన కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

'క' మూవీకి స్వల్పంగా పెరిగిన కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

KA Movie Day 2 Box Office Collection: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకుల నుంచి "క" సినిమా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. క మూవీ మొదటి రోజున వరల్డ్ వైడ్‌గా రూ. 6.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

మొదటి రోజు కంటే ఎక్కువగా

ఇలాగే రెండో రోజు కూడా క మూవీ కలెక్షన్లలో హవా కొనసాగించింది. రెండో రోజు రూ. 6.19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వరల్డ్ వైడ్‌గా సాధించినట్లు తెలుస్తోంది. అంటే, మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ అతి స్వల్పంగా పెరిగాయి. ఇక క సినిమా 2 రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

క మూవీ కలెక్షన్స్

ఈ విషయానికి సంబంధించి మేకర్స్ క మూవీ కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక క మూవీకి 3వ రోజు కూడా బుకింగ్స్ ఉధృతి కొనసాగుతోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే "క" ఫస్ట్ వీక్ హ్యూజ్ కలెక్షన్స్ సాధించనుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, క మూవీకి ఇండియాలో తొలి రోజు మూడున్నర కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాగా రెండో రోజున రూ. 3 కోట్లు వచ్చాయి.

క థియేటర్ ఆక్యుపెన్సీ

ఇక రెండు రోజుల్లో కేవలం ఇండియాలోనే క మూవీకి రూ. 6.80 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున అంటే నవంబర్ 1న 63.86 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. వాటిలో ఉదయం షోలు 43.82 శాతం, మధ్యాహ్నానికి 62.82 శాతం, ఫస్ట్ షోలకు 70.53 శాతం, ఇక నైట్ షోలకు 78.27 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది.

సరికొత్త థ్రిల్లర్ అంటూ

అంటే, షోకి షోకి ఆక్యుపెన్సీ పెరుగుతూ పోతోందని తెలుస్తోంది. ఇక క మూవీకి మంచి రివ్యూలు ఇస్తున్నారు ఆడియెన్స్. ఓ సరికొత్త థ్రిల్లర్ మూవీని చూశామని "క" సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. కిరణ్ అబ్బవరం పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా ఉందని, రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక అప్రిషియేషన్స్ అందుకుంటున్నారు.

సర్‌ప్రైజ్ ట్విస్టులు

ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే ట్విస్టులతో దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించి తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, "క" సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.

ఇక క మూవీలో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్‌తోపాటు అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

తదుపరి వ్యాసం