Richest TV Actor: ఇండియాలో రిచెస్ట్ టీవీ యాక్టర్ ఇతడే.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటాడో తెలుసా? ఆ సీరియల్ నటి కూడా..
- Richest TV Actor: ఇండియాలో టీవీ నటుల్లో అత్యధిక ధనవంతుడు ఎవరు? ఒక్కో ఎపిసోడ్ కు వాళ్లు తీసుకునే మొత్తం ఎంత? కపిల్ శర్మ, రూపాలీ గంగూలీ, దిలీప్ జోషి, సునీల్ గ్రోవర్ లాంటి వాళ్లు ఈ వరుసలో ముందున్నారు.
- Richest TV Actor: ఇండియాలో టీవీ నటుల్లో అత్యధిక ధనవంతుడు ఎవరు? ఒక్కో ఎపిసోడ్ కు వాళ్లు తీసుకునే మొత్తం ఎంత? కపిల్ శర్మ, రూపాలీ గంగూలీ, దిలీప్ జోషి, సునీల్ గ్రోవర్ లాంటి వాళ్లు ఈ వరుసలో ముందున్నారు.
(1 / 7)
Richest TV Actor: టీవీ షోలు, సీరియల్స్ లో నటించే వాళ్లకు సినిమా నటులతో పోలిస్తే దక్కేది చాలా తక్కువే. కానీ టీవీల్లోనూ కొందరు నటులు ఉన్నారు. వాళ్ల రేంజ్ సినిమా వాళ్లకు ఏమాత్రం తక్కువ కాదు.
(2 / 7)
Richest TV Actor: బుల్లితెర రారాజుగా కమెడియన్ కపిల్ శర్మను చెప్పొచ్చు. దేశంలోనే అతడు అత్యంత ధనవంతుదైన టీవీ నటుడు కావడం విశేషం.
(3 / 7)
Richest TV Actor: మనీ కంట్రోల్ రిపోర్టు ప్రకారం.. కపిల్ శర్మ ఒక ఎపిసోడ్ కు రూ.5 కోట్లు తీసుకుంటాడట. అంతేకాదు అతని మొత్తం సంపద విలువ రూ.300 కోట్లకుపైనే అని కూడా మరో రిపోర్టు వెల్లడించింది.
(4 / 7)
Richest TV Actor: ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో కపిల్ శర్మతోపాటు పాపులర్ అయిన మరో కమెడియన్ సునీల్ గ్రోవర్. అతడు ఇందులో ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.25 లక్షలు అందుకోవడం విశేషం.
(5 / 7)
Richest TV Actor: కపిల్ శర్మ ఆస్తుల విషయానికొస్తే.. అతనికి ముంబైలో రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. తన సొంతూరు చండీగఢ్ లో రూ.25 కోట్ల విలువైన ఫాంహౌస్ కూడా ఉంది. కపిల్ శర్మకు మెర్సిడెస్, రేంజ్ రోవర్ సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.
(6 / 7)
Richest TV Actor: ఇక ఇండియాలో అత్యధిక రేటింగ్ సంపాదించే సీరియల్ అనుపమ. ఎన్నో రోజులుగా ఈ సీరియల్ టాప్ లోనే కొనసాగుతోంది. ఇందులో లీడ్ రోల్ పోషించే నటి రూపాలీ గంగూలీ కూడా తక్కువేమ కాదు. ఆమె ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.3 లక్షలు తీసుకుంటుంది.
ఇతర గ్యాలరీలు