తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jaya Jaya Jaya Jaya Hey Movie: తెలుగులోకి మలయాళ సంచలనం ‘జయ జయ జయ జయహే’

Jaya Jaya Jaya Jaya Hey Movie: తెలుగులోకి మలయాళ సంచలనం ‘జయ జయ జయ జయహే’

HT Telugu Desk HT Telugu

20 November 2022, 8:16 IST

    • Jaya Jaya Jaya Jaya Hey Filim: బసిల్‌ జోసెఫ్‌, దర్శన రాజేంద్రన్‌ జంటగా నటించిన ‘జయ జయ జయ జయహే’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. సంచలనం సృష్టించిన ఈ మళయాళ మూవీ... త్వరలోనే తెలుగులో విడుదల కాబోతుంది.
తెలుగులో రాబోతున్న మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’
తెలుగులో రాబోతున్న మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’

తెలుగులో రాబోతున్న మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’

Jaya Jaya Jaya Jaya Hey Filim in Telugu: ‘జయ జయ జయ జయహే’... ఇటీవల కాలంలో ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రం. కేవలం రూ.6 కోట్లతో సినిమా తీస్తే, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.40కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. సినిమా బడ్జెట్‌కు దాదాపు పదిరెట్లు నిర్మాతకు లాభాల పంట పండించింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలను ఏ భాషా ప్రేక్షకుడైనా ఆదరిస్తాడని చెప్పటానికి ఈ సినిమా మరో నిదర్శనమని చెప్పొచ్చు. బసిల్‌ జోసెఫ్‌, దర్శన రాజేంద్రన్‌ జంటగా నటించిన ఈ మూవీ అక్టోబరు 28న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ బయటికి వచ్చింది. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

The Goat Life OTT Release Date: ఈవారం ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

OTT Releases this week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

The Broken News Season 2 Review: క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..

చిత్ర నేపథ్యం ఇదే…

Jaya Jaya Jaya Jaya Hey Movie Story: ఈ చిత్ర కథాంశంను చూస్తే… జయ తెలివైన మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్ కోసం ఖరీదైన స్కూల్ లో చేర్పిస్తారు. అయితే జయను మాత్రం తన ఆశలకు వ్యతిరేకంగా ఇంటి దగ్గరలో చేరుస్తారు. అందుకే తల్లిదండ్రులపై అప్పుడప్పుడు తిరుగుబాబు చేస్తూ ఉంటుంది జయ. దాంతో చదువు పూర్తి కాకముందే ఆమెకు పెళ్ళి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. పౌల్ట్రీ యజమాని రాజేష్ ను జయకు సరైన వరుడుగా నిర్ణయిస్తారు. అయితే తన చదువును కొనసాగించడానికి అంగీకరించిన తర్వాత పెళ్ళికి అంగీకరిస్తుంది జయ. పెళ్ళి తర్వాత రాజేష్ జయ చదువు వాయిదా వేస్తూ ఇంట్లో జరిగే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని మొండిగా ఉంటాడు. ఆ తర్వాత జయను శారీరకంగా కూడా హింసిస్తాడు. అది సర్వ సాధారణ వ్యవహారంగా మారటంతో జయ తల్లిదండ్రుల మద్దతు కోరుతుంది. కానీ వారు సర్దుకుపొమ్మని చెబుతారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ రారన్న నిజాన్ని గ్రహించి తదనుగుణంగా చర్యలు తీసుకుని తన కష్టాలకు ఎలా ముగింపు పలికింది అనేది మిగతా కథ.

మే నెలలో షూటింగ్ మొదలు పెట్టి 42 రోజుల్లో పూర్తి చేసి అక్టోబరులో ఈ సినిమాను విడుదల చేశారు. పలువురు ప్రశంసలూ అందుకున్న ఈ చిత్రానికి... అంకిత్ మీనన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. అయితే దానికంటే ముందే, ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.