తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pooja Hegde: టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ్డ పూజాహెగ్డే ?- బాయ్‌ఫ్రెండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇదేనా?

Pooja Hegde: టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్‌తో ప్రేమ‌లో ప‌డ్డ పూజాహెగ్డే ?- బాయ్‌ఫ్రెండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇదేనా?

18 April 2024, 12:18 IST

google News
  • Pooja Hegde: పూజా హెగ్డే ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. హిందీ సీరియ‌ల్ యాక్ట‌ర్ రోహ‌న్ మెహ్ర‌తో పూజాహెగ్డే డేటింగ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

 పూజాహెగ్డే , రోహ‌న్ మెహ్ర‌
పూజాహెగ్డే , రోహ‌న్ మెహ్ర‌

పూజాహెగ్డే , రోహ‌న్ మెహ్ర‌

Pooja Hegde: పూజాహెగ్డే ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటోన్న ఈ బ్యూటీ ప్రియుడితో రొమాన్స్‌లో మునిగితేలుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 10 ఫేమ్‌, సీరియ‌ల్ యాక్ట‌ర్ రోహ‌న్ మెహ్ర‌తో పూజాహెగ్డేడేటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

రోహ‌న్ మెహ్ర కూడా...

గ‌త కొన్నాళ్లుగా పూజాహెగ్డే ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ ఆమె వెంట రోహ‌న్ మెహ్ర కూడా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. బుధ‌వారం పూజాహెగ్డే త‌న ఫ్యామిలీతో క‌లిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వ‌చ్చింది. పూజాహెగ్డే ఫ్యామిలీతో పాటు రోహ‌న్ మెహ్ర కూడా రెస్టారెంట్‌లో క‌నిపించాడు. పూజాహెగ్డే ఫ్యామిలీతో క‌లిసి రోహ‌న్ మెహ్ర‌ ఫోటోల‌కు ఫోజిచ్చాడు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

కొత్త బాయ్‌ఫ్రెండ్ ఇత‌డే...

రోహ‌న్‌తో పూజాహెగ్డే డేటింగ్‌లో ఉన్న‌ట్లు ప‌లువురు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. పూజాహెగ్డే కొత్త బాయ్ ఫ్రెండ్ ఇత‌డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోహ‌న్‌ను త‌న త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం చేయ‌డం కోస‌మే పూజాహెగ్డే ఈ పార్టీని అరెంజ్ చేసింద‌ని అంటున్నారు. కామ‌న్ ఫ్రెండ్‌తో ద్వారా రోహ‌న్‌తో పూజాహెగ్డేకు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

టీవీ సీరియ‌ల్స్‌తో...

రోహ‌న్ మెహ్ర హిందీలో ప‌లు టీవీ సీరియ‌ల్స్‌తో పాటు రియాలిటీ షోస్ చేశాడు. గుమ్రా ఎండ్ ఆఫ్ ఎన్నోసెన్స్ సీరియ్‌తో న‌టుడిగా రోహ‌న్ మెహ్ర కెరీర్ ఆరంభ‌మైంది. ఏ హై ఆషిఖీ, ఏ రిష్తా క్యా కెహ్ల‌తా హై, స‌సురాయ్ సిమ‌ర్ కా సీరియ‌ల్స్ చేశాడు.

బిగ్‌బాస్ 10లో...

హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 10లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. ఫైన‌ల్ చేరుకున్న అత‌డు ఐదో స్థానంతో స‌రిపెట్టుకున్నాడు. బిగ్‌బాస్ 11, కిచెన్ ఛాంపియ‌న్‌, లాక్ ఆప్ వంటి షోల‌లో గెస్ట్‌గా చేశాడు. ముఖ్యంగా హిందీ మ్యూజిక్ వీడియోల‌తో రోహ‌న్ బాలీవుడ్ ఫ్యాన్స్‌కు సుప‌రిచితుడ‌య్యాడు. యాభైకిపైగా మ్యూజిక్ వీడియోల‌లో న‌టించాడు. మ్యూజిక్ వీడియోలు, సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై స్టార్‌గా చెలామ‌ణి అయిన రోహ‌న్‌కు వెండితెర‌పై మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హిందీలో కేవ‌లం మూడు సినిమాలు మాత్ర‌మే చేశాడు. అవి కూడా డిజాస్ట‌ర్స్ అయ్యాయి.

చివ‌ర‌గా ఆచార్య‌లో..

టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా చెలామ‌ణి అయిన పూజా హెగ్డేకు ప్ర‌స్తుతం బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ వ‌చ్చిన ఈ బ్యూటీ చేతిలో ప్ర‌స్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో టాలీవుడ్‌కు దూర‌మైంది. చివ‌ర‌గా 2022లో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆచార్య‌లో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఎఫ్ 3 మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ మ‌ళ్లీ టాలీవుడ్ ప్రేక్ష‌కులకు క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది.

బాలీవుడ్‌లో బ్యాడ్‌ల‌క్‌...

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో పూజాహెగ్డేకు ల‌క్ క‌లిసిరాలేదు. స‌ల్మాన్‌ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌, ర‌ణ్‌వీర్‌సింగ్ స‌ర్క‌స్ సినిమాల్లో పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కానీ ఈ రెండు సినిమాలు హిందీలో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. స‌గం కూడా వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌లేక చ‌తికిలాప‌డ్డాయి. ప్ర‌స్తుతం హిందీలో దేవా మూవీ చేస్తోంది పూజాహెగ్డే. షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీపైనే పూజాహెగ్డే మొత్తం ఆశ‌లు పెట్టుకుంది.

తదుపరి వ్యాసం