Abraham Ozler OTT: మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నటించిన మలయాళం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది!
Abraham Ozler OTT: మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జయరాం హీరోగా నటించిన ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Abraham Ozler OTT: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన అబ్రహం ఓజ్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జయరాం హీరోగా నటించాడు. మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో చేశాడు. . డిసెంబర్ 25న అబ్రహం ఓజ్లర్ మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ గా మూవీ 37 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
జయరాం నటనకు ప్రశంసలు...
ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా జయరాం యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా అబ్రహం ఓజ్లర్ నిలిచింది. ఇందులో అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మమ్ముట్టి నటించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి రోల్ గురించి రిలీజ్‌కు ముందు మేకర్స్ సస్పెన్స్‌గా ఉంచారు. సీరియల్ రోల్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. 30 నిమిషాల కంటే తక్కువ నిడివితోనే అతడి పాత్ర సినిమాలో కనిపిస్తుంది.
అబ్రహం ఓజ్లర్ కథ ఇదే...
అబ్రహం ఓజ్లర్ (జయరాం) భార్యాపిల్లలు మిస్సవుతారు. వారు కనిపించకుండా పోయినా ఉన్నట్లుగా ఓజ్లర్ ఊహించుకుంటుంటాడు. వరుసగా కొందరు భిన్న నేపథ్యాలు కలిగిన వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు. వారి వద్ద హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. ఆ హత్యల వెనకున్న ట్విస్ట్‌ను ఓజ్లర్ ఎలా ఛేదించాడు? అలెక్స్ (మమ్ముట్టి) సీరియల్ కిల్లర్‌గా మారడానికి కారణం ఏమిటి? సుజా అనే అమ్మాయిని ప్రేమించిన అలెక్స్ ఆమె మరణానికి కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. అబ్రహం ఓజ్లర్ మూవీకి మిదున్ థామస్ దర్శకత్వం వహించాడు.
జయరాం డబుల్ ట్రీట్...
జయరాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజవ్వగా తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తండ్రిగా జయరాం కీలక పాత్రలో కనిపించాడు.
భాగమతితో ఎంట్రీ...
తెలుగులో జయరాం యాక్టింగ్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. 2018లో రిలీజై అనుష్క భాగమతి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు జయరాం. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఖుషి, హాయ్‌నాన్న డిఫరెంట్ రోల్స్ చేశాడు. రవితేజ ధమాకాలో విలన్‌గా జయరాం కనిపించాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ జయరాం కీలక పాత్ర పోషిస్తోన్నాడు.
రెండు బ్లాక్‌బస్టర్స్...
మరోవైపు గత ఏడాది మమ్ముట్టి హీరోగా నటించిన కన్నూర్ స్వ్యాడ్, కాథల్ ది కోర్ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. కన్నూర్ స్వ్యాడ్‌లో పోలీస్ ఆఫీసర్‌గా మమ్ముట్టి కనిపించాడు. కాథ్‌ల్‌లో హోమో సెక్సువల్ పాత్ర చేశాడు. మమ్ముట్టిహీరోగా నటించిన భ్రమయుగం మూవీ ఫిబ్రవరి 15న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది.