తెలుగు న్యూస్ / ఫోటో /
Amazon offers on Mobiles: ఈ టాప్-5 సామ్‍సంగ్ మొబైళ్లపై అమెజాన్‍లో డిస్కౌంట్లు
ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో ప్రస్తుతం కొన్ని సామ్‍సంగ్ ఫోన్‍లపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. పాపులర్ మోడళ్లపై ఆఫర్స్ లభిస్తున్నాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎం33 5జీ, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22తో పాటు మరిన్ని ఫోన్‍లపై మంచి డీల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. అవేంటో చూడండి.
(1 / 5)
Samsung Galaxy M33 5G: 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉండే సామ్‍సంగ్ గెలాక్సీ ఎం33 5జీ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‍లో రూ.16,999కే లభిస్తోంది. లిస్టింగ్ ధరతో పోలిస్తే సుమారు 32శాతం డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్లను వినియోగించుకొని రూ.13,300 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ చేసే పాత మోడల్, ఫోన్ కండీషన్‍ను బట్టి ఎక్స్చేంజ్ విలువ ఉంటుంది.(HT Tech)
(2 / 5)
Samsung Galaxy A23: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ23 బేస్ వేరియంట్‍ను అమెజాన్‍లో రూ.18,499కే దక్కించుకోవచ్చు. ఎక్చ్సేంజ్ ఆఫర్ కింద రూ.13,300 తగ్గింపును పొందవచ్చు. అలాగే బ్యాంక్ కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. (Amazon)
(3 / 5)
Samsung Galaxy S20 FE 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్‍పై ప్రస్తుతం అమెజాన్‍లో భారీ డిస్కౌంట్ ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉండే ఈ ఫోన్ ధర రూ.32,990గా ఉంది. లిస్టింగ్ ధరతో పోలిస్తే 50శాతం కంటే ఎక్కువ తగ్గింపు ధరతో ఉంది. ఇక ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,300 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.(Samsung)
(4 / 5)
Samsung Galaxy M53 5G: 23శాతం డిస్కౌంట్‍తో ప్రస్తుతం సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ అమెజాన్‍లో లభిస్తోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకొని రూ.13,300 వరకు అదనపు తగ్గింపు దక్కించుకోవచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ఫోన్ మోడల్, పరిస్థితిని బట్టి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందని గుర్తించుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‍పై బ్యాంక్ కార్డ్ ఆఫర్ కు ప్రస్తుతం అందుబాటులో ఉంది. (Samsung)
(5 / 5)
Samsung Galaxy S22 5G: ప్రీమియం ఫోన్ సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22 5జీ కూడా ప్రస్తుతం అమెజాన్‍లో తగ్గింపు ధరతో లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ రూ.52,999కు లభిస్తోంది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇది 38శాతం డిస్కౌంట్. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.13,300 వరకు తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ కార్డ్ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. (HT Tech)
ఇతర గ్యాలరీలు