Mammootty Kaathal Ban: గే కాన్సెప్ట్‌తో మమ్ముట్టి, జ్యోతిక కాథల్ మూవీ - గల్ఫ్ కంట్రీస్‌లో సినిమా బ్యాన్
Mammootty Kaathal Ban: మమ్ముట్టి, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న కాథల్ మూవీపై గల్ఫ్ కంట్రీస్ నిషేధం విధించాయి. గే కాన్సెప్ట్ సినిమా తెరకెక్కుతోండటంతోనే ఈ సినిమాను బ్యాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Mammootty Kaathal Ban: మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన కాథల్ మూవీ రిలీజ్‌ను ఖతార్, కువైట్‌తో పాటు గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి. ఈ సినిమాలోని కంటెంట్ అందుకు కారణమని సమాచారం. గే సెక్స్ అనే కాన్సెప్ట్‌తో కాథల్ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
తమ దేశ సిద్ధాంతాలు, ఆలోచన విధానాలకు వ్యతిరేకమైన కంటెంట్ కావడంతో మమ్ముట్టి మూవీ రిలీజ్‌పై ఖతార్, కువైట్ దేశాలు నిషేధం విధించినట్లు తెలిసింది. ఖతార్, కువైట్‌తో పాటు మిగిలిన అరేబియా దేశాల్లో మమ్ముట్టి, జ్యోతిక మూవీ రిలీజ్ కావడం అనుమానమేనని సమాచారం.
కాథల్ సినిమాకు ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ఫేమ్ జియో బేబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను స్వీయ నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై మమ్ముట్టి నిర్మిస్తున్నాడు. కాథల్ సినిమాతో దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత జ్యోతిక మలయాళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది. చివరగా జ్యోతిక మలయాళంలో సీతా కళ్యాణం అనే సినిమా చేసింది.
కాథల్ మూవీ నవంబర్ 23న రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది కన్నూర్ స్క్వాడ్‌తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు మమ్ముట్టి. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది.
టాపిక్