తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hca Award For Ntr: మళ్లీ దిగి వచ్చిన హెచ్‌సీఏ.. ఎన్టీఆర్‌కు అవార్డు ఇస్తున్నట్లు ప్రకటన

HCA Award for NTR: మళ్లీ దిగి వచ్చిన హెచ్‌సీఏ.. ఎన్టీఆర్‌కు అవార్డు ఇస్తున్నట్లు ప్రకటన

03 March 2023, 20:48 IST

    • HCA Award for NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్ మరోసారి దిగివచ్చింది. ఇప్పటికే తారక్‌ను ఆహ్వానించామని వివరణ ఇచ్చుకున్న సంస్థ.. ఈ సారి అతడికి అవార్డు కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్‌సీఏ ఫైర్ అవ్వడంచో ఈ విధంగా దిగివచ్చింది.
ఎన్టీఆర్‌కు అవార్డు ప్రకటించిన హెచ్‌సీఏ
ఎన్టీఆర్‌కు అవార్డు ప్రకటించిన హెచ్‌సీఏ

ఎన్టీఆర్‌కు అవార్డు ప్రకటించిన హెచ్‌సీఏ

HCA Award for NTR: హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, కీరవాణి, సెంథిల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఐదు విభాగాల్లో హెచ్‌సీఏ అవార్డులను దక్కించుకుందీ చిత్రం. అయితే ఐదు విభాగాల్లో అవార్డును ప్రకటించిన ఈ సంస్థ రామ్ చరణ్‌కు అవార్డును ఇచ్చి జూనియర్ ఎన్‌టీఆర్‌ను మాత్రం పట్టించుకోలేదు. ఇది కాస్త తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఆర్ఆర్ఆర్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన తర్వాత ఆస్కార్‌కు నామినేటైంది. ఆ తర్వాత హాలీవుడ్ క్రిటిక్స్ అసొసియేషన్ నుంచి ప్రతిష్టాత్మక అవార్డుల రావడంతో సర్వత్రా ఆర్ఆర్ఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలైన బ్లాక్ ప్యాంథర్, బ్యాట్‌మ్యాన్, ది వుమెన్ కింగ్, టాప్ గన్ మ్యావ్రిక్ లాంటి సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఈ చిత్రానికి హెచ్‌సీఏ అవార్డులను దక్కించుకుందీ చిత్రం. మొత్తం 5 కేటగిరీల్లో అవార్డులు రాగా.. ఇందులో రామ్ చరణ్‌కు స్పాట్‌లైట్ పురస్కారం లభించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం మర్చిపోయింది హెచ్‌సీఏ. దీంతో హెచ్‌సీఏ నిర్వాహకులపై తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. దీంతో సదరు అవార్డు సంస్ధ దిగి వచ్చి దిద్దుబాటు చర్యలకు దిగింది.

జూనియర్ ఎన్టీఆర్‌కు స్పాట్ లైట్ అవార్డును ప్రకటించడమే కాకుండా ఆలియా భట్‌కు కూడా ఈ అవార్డును ఇస్తున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా ఈ అవార్డులను వచ్చే వారం నేరుగా వారికే పంపిస్తామని తెలిపింది. ట్విటర్ వేదికగా వీరిద్దరి పేర్లతో అవార్డులను ఇస్తున్నట్లు ఆ ఫొటోలను కూడా షేర్ చేసింది.

ఇప్పటికే అవార్డు ప్రదానోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో అతడిని ఆహ్వానించలేదేమోనని హెచ్‌సీఏ నిర్వాహకులపై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే వాస్తవానికి ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించామని, వ్యక్తిగత కారణాలతోనే రాలేదని హెచ్‌సీఏ తెలిపింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.