Navdeep: నా పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీస్‌లోని పాయింట్స్ చూపించాం.. 20 ఏళ్ల తర్వాత ఇలా: హీరో నవదీప్
27 May 2024, 12:57 IST
Navdeep About Love Mouli Movie: హీరో నవదీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ మౌళి. ఇటీవల నిర్వహించిన లవ్ మౌళి ప్రెస్ మీట్లో మూవీలో తన పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీస్ పాయింట్స్ టచ్ చేసి చూపించామని హీరో నవదీప్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
నా పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీస్‌లోని పాయింట్స్ చూపించాం.. 20 ఏళ్ల కెరీర్ తర్వాత ఇలా: హీరో నవదీప్
Navdeep About Love Mouli Movie: సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ 2.Oగా కనిపించునున్న చిత్రం లవ్ మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు.
లవ్ మౌళి చిత్రాన్ని నైరా క్రియేషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సీ స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకుంది ఈ సినిమా. లవ్ మౌళికి సెన్సార్ బోర్డ్ మెంబర్స్ 'ఏ' సర్టిఫికెట్‌ను అందజేశారు.
కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ మూవీ జూన్ 7న విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు చెప్పాడు హీరో నవదీప్.
"అన్ని లాంగ్వేజ్‌లో రకరకాల కొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో తెలుగులో రాబోతున్న వైవిధ్యమన, విభిన్నమైన సినిమా ఇది. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే సినిమా ఇది. ఆడియన్స్‌కు థియేటర్‌కు ఎందుకు రావాలో అన్న ప్రశ్నకు ఈ చిత్రంలో సమాధానం దొరుకుతుంది. చిరపుంజి, మేఘాలయాలోని అందరమైన ప్రదేశాల్లో షూట్ చేసిన చిత్రమిది" అని హీరో నవదీప్ తెలిపారు.
"ఈ కథ విన్నప్పుడు అక్కడే చేయాలని అనిపించింది. ఎన్నో వ్యయ ప్రయసాలతో చిత్రీకరణ చేశాం. ఈ సినిమా ప్రొడక్షన్ ఎలా జరిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యెచ్చు. మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామనే నమ్మకం కలిగింది. ఇక సినిమా ఫలితం ఆడియన్స్ చేతిలో ఉంది" అని నవదీప్ అన్నారు.
"కథ వినగానే నచ్చిన సినిమా ఇది. నా పర్సనల్ లైఫ్‌లో నా ప్రేమ కథలు, నా లవ్ స్టోరీల్లో ఉన్న పాయింట్‌ను టచ్ చేశాం. ఈ కథ, ఈ పాయింట్ కనెక్ట్ అయితే వాళ్ల పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని ఉంది. ఈ 20 ఏళ్ల కెరీర్ తరువాత నాలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది" అని హీరో నవదీప్ చెప్పుకొచ్చారు.
"ఇందులో నేటి యువ తరానికి కావాల్సిన అంశాలున్నాయి. ఈ చిత్రంలో అందరికి రిలేట్ అయ్యే, కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ప్రేమలో ఉన్న వారి రిలేషన్స్ ఎలా ఉన్నాయి. నేటి యువతరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా బ్రేకప్‌లు అవుతున్నాయి. కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్స్ నిలబడవా? అనే ప్రశ్నకు నాకు దొరికిన పరిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపెడుతున్నాం" అని డైరెక్టర్ అవనీంద్ర తెలిపారు.
"ఈ సినిమా డీఐ కేరళలో జరుగుతున్నప్పుడు మంజుమ్మల్ బాయ్స్, ఆవేశానికి పనిచేసిన కలరిస్ట్ మా సినిమాకు పనిచేస్తున్నప్పుడు సినిమా చూసి ఎంతో అభినందించాడు. ఆయన అందించిన ప్రశంసలు మరువలేనిది. రేపు చిత్రం విడుదలైన తరువాత కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం నవదీప్ చాలా కష్టపడ్డాడు. అందుకు తగిన ప్రతిఫలం ఆయనకు లభిస్తుందనే నమ్మకం ఉంది" అని లవ్ మౌళి డైరెక్టర్ అవనీంద్ర చెప్పుకొచ్చారు.