Dugout OTT: ఓటీటీలో క్రికెట్ థీమ్ రియాలీటీ షో డగౌట్.. హోస్టుగా నవదీప్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?-navdeep dugout ott streaming release date and teaser out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Navdeep Dugout Ott Streaming Release Date And Teaser Out

Dugout OTT: ఓటీటీలో క్రికెట్ థీమ్ రియాలీటీ షో డగౌట్.. హోస్టుగా నవదీప్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 16, 2023 11:57 AM IST

Navdeep DugOut OTT:తెలుగు హీరో నవదీప్ హోస్టుగా వస్తున్న సరికొత్త క్రికెట్ థీమ్ రియాలిటీ షో డగౌట్. క్రికెట్ నేపథ్యంతో పాపులర్ సెలబ్రిటీలతో నవదీప్ ఆడించే ఆటే ఈ డగౌట్. తాజాగా డగౌట్ టీజర్ విడుదల చేసి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించారు.

ఓటీటీలోకి క్రికెట్ థీమ్ రియాలీటీ షో డగౌట్
ఓటీటీలోకి క్రికెట్ థీమ్ రియాలీటీ షో డగౌట్

Navdeep DugOut Reality Show: జై మూవీతో హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నవదీప్. ఈ మూవీ తర్వాత మొదటి సినిమా, గౌతమ్ ఎస్ఎస్‌సీ, చందమామ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ, అనంతరం హీరోగా కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్, గ్రే రోల్స్ చేస్తూ అలరించాడు. ఇటీవలే న్యూసెన్స్ అనే వెబ్ సిరీసుతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నవదీప్.

ట్రెండింగ్ వార్తలు

అంతేకాకుండా, 2012లో తెలుగు బుల్లితెరపై సూపర్ అనే రియాలిటీ షోకి హోస్టుగా చేసి అలరించిన హీరో నవదీప్ ఇప్పుడు మరో సరికొత్త రియాలిటీ షోతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రికెట్ థీమ్‌తో త్వరలో ఓటీటీలోకి రానున్న రియాలిటీ గేమ్ షో డగౌట్. రోల్ టు రూల్ అనేది క్యాప్షన్. తాజాగా డగౌట్ టీజర్ విడుదల చేసి స్ట్రీమింగ్ వివరాలను వెల్లడించారు.

"చేతిలో ఆట, ఆటలో వేట.. ఇక క్రికెట్ పండుగే ప్రతీ చోట" అని రాసుకొస్తూ ప్రముఖ ఓటీటీ ఆహాలో డగౌట్ రియాలిటీ షోను నవంబర్ 18న రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన టీజర్‌లో "క్రికెట్ అంటే గేమ్ కాదు.. ఒక ఎమోషన్", "రోల్ చేసేది సెలబ్రిటీలు.. రూల్ చేసేది మనం" అంటూ నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇక గేమ్ గురించి సెలబ్రిటీలు వచ్చాక చెబుతాని సస్పెన్స్ క్రియేట్ చేశాడు.

టీజర్‌ చూస్తుంటే డైస్‌ను రోల్ చేసి దాంతో పాయింట్స్ ఆధారంగా గెలుపు, ఓటములు ఉంటాయని అర్థమవుతోంది. ఇదే టీజర్‌లో డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి, కలర్స్ స్వాతి రెడ్డితోపాటు మంత్ ఆఫ్ మధు మూవీ టీమ్ సందడి చేసింది. వీళ్లే కాకుండా మంగళవారం సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, శ్రవణ్ రెడ్డి అతిథులుగా హాజరు కానున్నట్లు సమాచారం.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.