OTT Movies This Week: ఓటీటీలోకి 19 సినిమాలు.. ఈ వారమే వచ్చేస్తున్న కామెడీ వెబ్ సిరీస్, హారర్ మూవీ.. కానీ అదొక్కటే నిరాశ!-ott movies release this week on netflix amazon prime hotstar panchayat 3 digital premiere the first omen ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఓటీటీలోకి 19 సినిమాలు.. ఈ వారమే వచ్చేస్తున్న కామెడీ వెబ్ సిరీస్, హారర్ మూవీ.. కానీ అదొక్కటే నిరాశ!

OTT Movies This Week: ఓటీటీలోకి 19 సినిమాలు.. ఈ వారమే వచ్చేస్తున్న కామెడీ వెబ్ సిరీస్, హారర్ మూవీ.. కానీ అదొక్కటే నిరాశ!

Sanjiv Kumar HT Telugu
May 27, 2024 10:39 AM IST

OTT Movies On This Week: ఈవారం ఓటీటీలోకి సినిమాలు వెబ్ సిరీసులు కలుపుకుని 19 స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వాటిలో ఎక్కువగా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. ఇండియాలోనే పాపులర్ వెబ్ సిరీస్‌లలో ఒకటైన పంచాయత్ సీజన్ 3 కూడా ఇదే వారంలో ఓటీటీలోకి వచ్చేయనుంది.

ఓటీటీలోకి 19 సినిమాలు.. 2 మూవీస్, 2 వెబ్ సిరీసులు స్పెషల్.. కానీ, అదొక్కటే నిరాశ!
ఓటీటీలోకి 19 సినిమాలు.. 2 మూవీస్, 2 వెబ్ సిరీసులు స్పెషల్.. కానీ, అదొక్కటే నిరాశ!

This Week OTT Movies: మళ్లీ కొత్త వారం రానే వచ్చేసింది. ఇటు ఓటీటీల్లో అటు థియేటర్లలో సినిమాల సందడి నెలకొననుంది. మొన్నటివరకు థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి విడుదల కాలేదు. కానీ, ఈవారం మాత్రం మూడు క్రేజీ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అవి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా, కార్తీక్ గుమ్మకొండ భజే వాయు వేగం సినిమాలు.

ఇక థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో ఇంకాస్తా సందడి ఎక్కువగా ఉండనుంది. ఈ వారం అంటే మే 27 నుంచి జూన్ 2 వరకు ఓటీటీలోకి సినిమాలు వెబ్ సిరీసులు కలిపి 19 స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఎక్కువగా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తెలుగు సినిమాలు అయితే ఏమాత్రం లేవు. మరి ఈసారి రిలీజ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ వెబ్ సిరీస్)- మే 29

ఎరిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 30

గీక్ గర్ల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 30

ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ మూవీ)- మే 31

రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 31

లంబర్ జాక్ ది మాన్‌స్టర్ (జపనీస్ చిత్రం)- జూన్ 1

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

కామ్డేన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 29

ది ఫస్ట్ ఒమన్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- మే 30

ఉప్పు పులి కారమ్ (తమిళ వెబ్ సిరీస్)- మే 30

జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31

జియో సినిమా ఓటీటీ

ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- మే 29

దేద్ బిగా జమీన్ (హిందీ మూవీ)- మే 31

లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 31

ది లాస్ట్ రెఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31

ఏలీన్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 1

జీ5 ఓటీటీ

స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ చిత్రం)- మే 28

హౌజ్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్)- మే 31

పంచాయత్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- మే 28

పొంబలై ఒరుమై (మలయాళ చిత్రం)- సైనా ప్లే ఓటీటీ- మే 31

ఇలా ఈ వారం ఓటీటీలోకి సినిమాలు వెబ్ సిరీసులు కలుపుకుని మొత్తంగా 19 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. కాకపోతే వీటిలో ఒక్క తెలుగు సినిమా, వెబ్ సిరీస్ లేదు. ఇదొక్కటే తెలుగు ప్రేక్షకులకు నిరాశ అని చెప్పాలి. కానీ, ఈసారి ఓటీటీలో రెండు వెబ్ సిరీసులు, రెండు సినిమాలు స్పెషల్ కానున్నాయి.

ఇండియాలో పాపులర్ వెబ్ సిరీసుల్లో ఒకటిగా హిట్ అయిన పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 3 అమెజాన్‌ ప్రైమ్‌లో, ఇల్లీగల్ సీజన్ 3 జియో సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే హారర్ మూవీ ది ఫస్ట్ ఒమెన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుండగా.. స్వాతంత్య్ర వీర్ సావర్కర్ జీ5లో రానుంది. ఈ నాలుగు ఈ వారం స్పెషల్ కానున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024