Malayalam Movie OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. సూపర్ స్టార్ కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?-malayalam movie varshangalkku shesham ott release on sony liv ott movies malayalam ott pranav mohanlal ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Movie Ott: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. సూపర్ స్టార్ కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Malayalam Movie OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. సూపర్ స్టార్ కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
May 26, 2024 01:50 PM IST

Varshangalkku Shesham OTT Streaming: ఓటీటీలోకి మరో మలయాళ మూవీ వర్షంగల్కు శేషం రానుంది. మలయాళ బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకుపైగా కలెక్ట్ చేసిన సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. వర్షంగల్కు శేషం ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏంటంటే..

ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. సూపర్ స్టార్ కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. సూపర్ స్టార్ కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Varshangalkku Shesham OTT Release: ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తున్నాయి. ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం, ఆవేశం సినిమాలు వరుసగా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కోట్లల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. దాంతో మిగతా సినీ ఇండస్ట్రీ అంతా మాలీవుడ్ వైపు చూసింది.

ఇటీవలే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన టర్బో మూవీ థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటించిన ఆవేశం అటు థియేటర్ ఇటు ఓటీటీలో అదిరిపోయే టాక్ తెచ్చుకోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడే మరో సినిమా రిలీజ్ అయింది. అదే వర్షంగల్కు శేషం (Varshangalkku Shesham Movie).

ఏప్రిల్ 11న మలయాళ థియేటర్లలో విడుదలైన వర్షంగల్కు శేషం మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 81.56 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు మాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్, నటుడు వినీత్ శ్రీనివాసన్ (Vineeth Sreenivasan) దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీని సౌత్ సినీ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేయనుంది.

వర్షంగల్కు శేషం సినిమా ఎవరు ఊహించని ఓటీటీ సోని లివ్‌లో (Sonyliv OTT) స్ట్రీమింగ్ కానుంది. సోని లివ్‌లో వర్షంగల్కు శేషం మూవీ జూన్ 7 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ సినిమాను మలయాళంలోనే ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఇతర దక్షిణాది భాషల డబ్బింగ్ వెర్షన్‌కు సంబంధించిన సమాచారం మాత్రం ఇంతవరకు తెలియలేదు. మరి త్వరలో వర్షంగల్కు శేషం తెలుగు వెర్షన్ ఓటీటీపై కూడా ప్రకటన ఇస్తారేమో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే, వర్షంగల్కు శేషం సినిమా ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్, ది గోట్ లైఫ్, ఆవేశం తర్వాత 2024 సంవత్సరంలో రూ. 50 కోట్ల మార్క్ దాటిన ఆరో మలయాళ మూవీగా రికార్డ్ సాధించింది. కాగా ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ (Pranav Mohanlal) హీరోగా నటించాడు. ప్రణవ్ మోహన్‌లాల్ సూపర్ హిట్ మూవీ హృదయంతో (Hridayam Movie) సౌత్ ఆడియెన్స్‌కు సుపరిచితమే.

వర్షంగల్కు శేషం సినిమాలో ప్రణవ్ మోహన్‌లాల్‌తోపాటు ధ్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan), కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితోపాటు నివిన్ పౌలీ, అజు వర్గీస్, బాసిల్ జోసెఫ్, నీరజ్ మాధవ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక వైశాఖ్ సుబ్రమణ్యం ఈ సినిమాను నిర్మించగా.. అమృత్ రామ్‌నాథ్ సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే మోహన్ లాల్ నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రణవ్ మోహన్‌లాల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ స్టార్ట్ చేశాడు. అనంతరం పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. ఆ తర్వాత 2018లో ఆది సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు ప్రణవ్. అయితే ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. అనంతరం చేసిన మరో రెండు సినిమాలు కూడా ప్లాప్‌గా నిలిచాయి. కానీ, 2022లో వచ్చిన హృదయం సినిమా హిట్టుతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2024