OTT Releases: ఓటీటీలోకి ఒక్కరోజే 10 సినిమాలు, వెబ్ సిరీసులు.. 4 సినిమాలు స్పెషల్.. మరో 2 మూవీస్ ఎక్స్‌ట్రా!
OTT Movies Releases Friday: ఈ శుక్రవారం (మే 23) ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి 10 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో నాలుగు స్పెషల్ కానుండగా.. తర్వాతి రోజున విడుదలైన మరో రెండు సినిమాలు ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఆ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.
Today OTT Releases: ఎప్పటికప్పుడు ఓటీటీలో విభిన్న సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ వారం ఓటీటీలోకి 20కిపైగా రిలీజ్ కాగా ఒక శుక్రవారమే (Friday OTT Release) అంటే మే 23న సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 10 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవెంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
రత్నం (తమిళ డబ్బింగ్ సినిమా)- మే 23 నుంచి స్ట్రీమింగ్
కలియుగం పట్టణంలో (తెలుగు సినిమా)- మే 23
మైదాన్ (హిందీ చిత్రం)- మే 23
ద టెస్ట్ 2 (వెబ్ సిరీస్)- మే 23
ది వన్ పర్సంట్ క్లబ్ (వెబ్ సిరీస్)- మే 23
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఇల్లూజన్స్ ఫర్ సేల్ (డాక్యుమెంటరీ సినిమా)- మే 23
ఇన్ గుడ్ హ్యాండ్స్ (హాలీవుడ్ చిత్రం)- మే 23
ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్ (హాలీవుడ్ వెబ్ సిరీస్)- మే 23
అట్లాస్ (హాలీవుడ్ స్కై ఫి చిత్రం)- మే 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది
క్య్రూ (హిందీ సినిమా)- మే 24
ముల్లిగన్ పార్ట్ 2- మే 24
ది కర్దాషియన్స్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- మే 23
ఆరంభం (తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 23
ఇలా ఓటీటీలోకి ఒక్క శుక్రవారం (మే 23) రోజున సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 10 విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీ ఆరంభం (Aarambham OTT), బాలీవుడ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మైదాన్ (Maidaan OTT), తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కలియుగం పట్టణంలో మూవీ (Kaliyugam Pattanamlo OTT), తమిళ యాక్షన్ సినిమా రత్నం (Rathnam OTT) వంటి మొత్తం 4 సినిమాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
వీటిలో మైదాన్ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime) రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. మిగతావి సబ్‌స్క్రిప్షన్ ద్వారా చూసేయొచ్చు. ఈ నాలుగింట్లో మైదాన్ మూవీ ఒక్కటి హిందీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమాను చూసి ఆనందించొచ్చు.
ఇంకా ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలోకి మరికొన్ని స్పెషల్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రసన్నవదనం (Prasanna Vadanam OTT) మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా సినిమాగా చెప్పుకోవచ్చు. సుహాస్ నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీలో (Aha OTT) మే 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రసన్నవదనం తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సినిమా క్య్రూ (Crew Movie OTT). బాలీవుడ్‌లో రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమా. ఇందులో సీనియర్ హీరోయిన్స్ కరీనా కపూర్, టబుతోపాటు ఆదిపురుష్ సీత కృతి సనన్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ముగ్గురు ముద్దుగుమ్మల లేడి ఒరియెంటెడ్ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) మే 24 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి క్య్రూ హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.
టాపిక్